నాలుగో రోజూ లాభాలతో షురూ

17 Dec, 2020 09:57 IST|Sakshi

87 పాయింట్లు ప్లస్‌‌- 46,753కు సెన్సెక్స్‌

23 పాయింట్ల లాభంతో 13,705 వద్ద కదులుతున్న నిఫ్టీ

రియల్టీ, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ డీలా‌- ఫార్మా ప్లస్‌

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5 శాతం అప్‌

ముంబై, సాక్షి: ఈక్విటీలలో కొనసాగుతున్న ఎఫ్‌పీఐల పెట్టుబడుల కారణంగా వరుసగా ఐదో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 87 పాయింట్లు పుంజుకుని 46,753కు చేరగా.. నిఫ్టీ 23 పాయింట్లు బలపడి 13,705 వద్ద ట్రేడవుతోంది. బుధవారం వరుసగా రెండో రోజు నాస్‌డాక్‌ సైతం సరికొత్త గరిష్టంవద్ద నిలిచింది. దీనికితోడు కోవిడ్‌-19 సంక్షోభం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టిన సంకేతాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ఆసక్తి చూపుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 46,778 పాయింట్ల వద్ద, నిఫ్టీ 13,718 వద్ద సరికొత్త గరిష్టాలను తాకాయి. 

మీడియా ప్లస్‌
ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా 1.3 శాతం, మీడియా 0.3 శాతం చొప్పున లాభపడగా.. రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్స్‌ 0.5-0.2 శాతం మధ్య డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో దివీస్‌, శ్రీసిమెంట్, ఇండస్‌ఇండ్‌, అల్ట్రాటెక్, హెచ్‌డీఎఫ్‌సీ, సన్‌ ఫార్మా, గ్రాసిమ్‌, ఆర్‌ఐఎల్‌, యూపీఎల్‌, పవర్‌గ్రిడ్‌ 2.6-1 శాతం మధ్య ఎగశాయి. అయితే హెచ్‌యూఎల్‌, అదానీ పోర్ట్స్‌, కోల్‌ ఇండియా, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఆటో, ఐటీసీ, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, నెస్లే, ఎన్‌టీపీసీ 1.25-0.5 శాతం మధ్య నీరసించాయి.

జూబిలెంట్‌ అప్‌
డెరివేటివ్స్‌లో జూబిలెంట్ ఫుడ్‌, పేజ్‌, మ్యాక్స్‌ ఫైనాన్స్‌, క్యాడిలా హెల్త్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌, అంబుజా 4-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, బీఈఎల్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, ఇండిగో, సెయిల్‌, డీఎల్‌ఎఫ్‌ 1.3-1 శాతం క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,409 లాభపడగా.. 824 నష్టాలతో ట్రేడవుతున్నాయి.

ఎఫ్‌ఫీఐల జోరు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,982 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1,718 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 2,484 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,667 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.

>
మరిన్ని వార్తలు