ఒడిదొడుకులతో షురూ- ఫార్మా ప్లస్‌లో

7 Oct, 2020 09:40 IST|Sakshi

స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్న సెన్సెక్స్‌- నిఫ్టీ

బ్యాంకింగ్, మెటల్‌, రియల్టీ, మీడియా డీలా

ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, ఆటో రంగాలు అప్‌

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ వెనకడుగు

అంచనాలకు అనుగుణంగా దేశీ స్టాక్‌ మార్కెట్లు అటూఇటుగా ప్రారంభమయ్యాయి. స్వల్ప ఒడిదొడుకుల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 57 పాయింట్లు క్షీణించి 39,517కు చేరగా.. నిఫ్టీ 13 పాయింట్లు తక్కువగా 11,649 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 39,633-39,451 పాయింట్ల మధ్య ఊగిసలాడగా.. నిఫ్టీ 11,680- 11,629 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. సహాయక ప్యాకేజీపై ప్రెసిడెంట్‌ ట్రంప్‌ వెనకడుగు వేయడంతో మంగళవారం యూఎస్‌ మార్కెట్లు పతనమయ్యాయి. మరోవైపు దేశీయంగా ఇటీవల మార్కెట్లు భారీ ర్యాలీ చేయడంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. 

బ్యాంక్స్‌ డౌన్
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా బ్యాంకింగ్‌, రియల్టీ, మెటల్‌, మీడియా రంగాలు 1 శాతం స్థాయిలో నీరసించగా.. ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, ఆటో 0.6-0.2 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్ ఫిన్‌, ఇండస్‌ఇండ్‌, ఐసీఐసీఐ, కోల్‌ ఇండియా, యాక్సిస్‌, టాటా మోటార్స్‌, ఐవోసీ, కొటక్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, గ్రాసిమ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హిందాల్కో, ఇన్ఫోసిస్‌, ఎస్‌బీఐ 3.7-0.6 శాతం మధ్య క్షీణించాయి. అయితే దివీస్‌, బ్రిటానియా, యూపీఎల్‌, ఆర్‌ఐఎల్‌, టీసీఎస్‌, హీరో మోటో, ఓఎన్‌జీసీ, సిప్లా, ఏషియన్‌ పెయింట్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, టైటన్‌, మారుతీ 1.5-0.5 శాతం మధ్య పుంజుకున్నాయి.

ఫైనాన్స్‌ వీక్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో శ్రీరామ్‌ ట్రాన్స్‌, చోళమండలం, మణప్పురం, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, ఎంజీఎల్‌, ముత్తూట్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, ఐడియా, పీవీఆర్‌, పెట్రోనెట్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ 2.5-1.5 శాతం మధ్య నష్టపోయాయి. కాగా.. మరోపక్క మారికో, జీఎంఆర్‌, ఇన్ఫ్రాటెల్‌, భారత్‌ ఫోర్జ్‌, టాటా పవర్‌, ఐబీ హౌసింగ్‌, ఐసీఐసీఐ ప్రు 2.2-1.2 శాతం మధ్య ఎగశాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.6-0.3 శాతం చొప్పున డీలా పడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 943 నష్టపోగా.. 638 లాభాలతో ట్రేడవుతున్నాయి.

మరిన్ని వార్తలు