నష్టాలతో షురూ- అన్ని రంగాలూ వీక్‌

29 Oct, 2020 09:41 IST|Sakshi

271 పాయింట్లు డౌన్‌- 39,651కు సెన్సెక్స్‌

93 పాయింట్ల నష్టంతో 11,637కు చేరిన నిఫ్టీ

ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ 1 శాతం డీలా

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5-1 శాతం డౌన్

ప్రపంచ మార్కెట్ల పతనం నేపథ్యంలో దేశీయంగానూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీశారు. దీంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 271 పాయింట్లు క్షీణించి 39,651కు చేరింది. నిఫ్టీ 93 పాయింట్లు కోల్పోయి 11,637 వద్ద ట్రేడవుతోంది. అమెరికాసహా బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌ తదితర దేశాలలో తిరిగి కోవిడ్‌-19 కేసులు పెరుగుతుండటంతో బుధవారం అమెరికన్‌, యూరోపియన్‌ మార్కెట్లు 2.6-4 శాతం మధ్య పతనమయ్యాయి. ప్రస్తుతం ఆసియాలోనూ మార్కెట్లు నీరసంగా కదులుతున్నాయి. దీనికితోడు నేడు అక్టోబర్‌ ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టుల ముగింపు కారణంగా ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

దిగ్గజాలు డీలా
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ 1.5-0.7 శాతం మధ్య డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో టైటన్‌, ఎల్‌అండ్‌టీ, టాటా మోటార్స్‌, ఓఎన్‌జీసీ, బజాజ్‌ ఆటో, అదానీ పోర్ట్స్‌, ఎస్‌బీఐ, హెచ్‌యూఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ 5-1 శాతం మధ్య క్షీణించాయి. బ్లూచిప్స్‌లో కేవలం అల్ట్రాటెక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, యాక్సిస్‌, టీసీఎస్‌ 1-0.3 శాతం మధ్య బలపడ్డాయి.

డెరివేటివ్స్‌ తీరిలా
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో ఫెడరల్‌ బ్యాంక్‌, బంధన్‌ బ్యాంక్‌, ఐబీ హౌసింగ్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌, పిరమల్‌, భెల్‌ 3.2-2.3 శాతం మధ్య నష్టపోయాయి. అయితే మరోవైపు పిడిలైట్‌, టొరంట్‌ పవర్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, కాల్గేట్‌, వేదాంతా, ఐజీఎల్‌, నౌకరీ 1.7-0.4 శాతం మధ్య పుంజుకున్నాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5-1 శాతం చొప్పున నీరసించాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,165 నష్టపోగా.. 454 మాత్రమే లాభాలతో ట్రేడవుతున్నాయి. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు