నేలచూపుతో షురూ- రియల్టీ లాభాల్లో

7 Aug, 2020 09:42 IST|Sakshi

సెన్సెక్స్‌‌ 144 పాయింట్లు డౌన్‌- 37,881కు

నిఫ్టీ 32 పాయింట్ల వెనకడుగు- 11,168 వద్ద ట్రేడింగ్‌

ఎన్‌ఎస్‌ఈలో ప్రధాన రంగాల వెనకడుగు

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.6 శాతం ప్లస్‌

ఆర్‌బీఐ దన్నుతో ముందు రోజు లాభపడిన దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 144 పాయింట్లు క్షీణించి 37,881 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 32 పాయింట్ల వెనకడుగుతో 11,168 వద్ద కదులుతోంది. గురువారం యూఎస్‌ మార్కెట్లు లాభపడినప్పటికీ ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో అమ్మకాల ధోరణి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమేర సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు.

ప్రధాన రంగాలు వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌, ఐటీ, మెటల్‌ 0.5 శాతం చొప్పున నీరసించగా..  రియల్టీ 0.7 శాతం బలపడింది. మీడియా, ఎఫ్‌ఎంసీజీ 0.2 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో యూపీఎల్‌, బీపీసీఎల్‌, గెయిల్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఇండస్‌ఇండ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, బజాజ్‌ ఫిన్‌, శ్రీ సిమెంట్, ఏషియన్‌ పెయింట్స్‌, ఓఎన్‌జీసీ, ఐవోసీ, అల్ట్రాటెక్‌, ఆర్‌ఐఎల్‌ 1.4-0.5 శాతం మధ్య లాభపడ్డాయి. మరోపక్క హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా స్టీల్‌, హీరో మోటో, ఐసీఐసీఐ, హిందాల్కో, ఇన్‌ఫ్రాటెల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, కొటక్‌ బ్యాంక్‌, సన్‌ ఫార్మా, ఐషర్‌ 2-0.5 శాతం మధ్య క్షీణించాయి.

టొరంట్‌ పవర్‌ జోరు
డెరివేటివ్స్‌లో టొరంట్ పవర్‌ 7 శాతం జంప్‌చేయగా.. ఈక్విటాస్‌, ఐబీ హౌసింగ్‌, పిరమల్‌, మణప్పురం, అపోలో హాస్పిటల్స్‌, ముత్తూట్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, అపోలో టైర్‌, సెంచురీ టెక్స్‌3.5-2 శాతం మధ్య ఎగశాయి. అయితే లుపిన్‌ 5 శాతం పతనంకాగా, ఐడియా, భెల్‌, అదానీ ఎంటర్‌, ఐజీఎల్‌, టొరంట్ ఫార్మా 2.5-1 శాతం మధ్య నీరసించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.6 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,114 లాభపడగా.. 556 నష్టాలతో కదులుతున్నాయి. 

మరిన్ని వార్తలు