గరిష్టానికి పీనోట్‌ పెట్టుబడులు,ఈ ఏడాదిలో హైయస్ట్‌    

1 Dec, 2022 15:14 IST|Sakshi

అక్టోబర్‌ చివరికి రూ.97,784 కోట్లు 

ఇందులో ఈక్విటీల్లోకి రూ.88,490 కోట్లు  

న్యూఢిల్లీ: దేశీ క్యాపిటల్‌ మార్కెట్లో పార్టిసిపేటరీ నోట్ల ద్వారా (పీ నోట్స్‌) పెట్టుబడులు అక్టోబర్‌ చివరికి రూ.97,784 కోట్లకు చేరాయి. ఈ ఏడాది ఇవి గరిష్ట స్థాయి పెట్టుబడులు కావడం గమనించాలి. సెబీ వద్ద నమోదైన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) విదేశీ ఇన్వెస్టర్లకు పీనోట్స్‌ను జారీ చేస్తుంటారు. ఈ నోట్స్‌ ద్వారా విదేశీ ఇన్వెస్టర్లు భారత క్యాపిటల్‌ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. (డిజిటల్‌ లోన్లపై అక్రమాలకు చెక్‌: కొత్త రూల్స్‌ నేటి నుంచే!)

సెబీ వద్ద ఉన్న డేటా ప్రకారం.. సెప్టెంబర్‌ చివరికి పీనోట్స్‌ పెట్టుబడులు ఈక్విటీ, డెట్, హైబ్రిడ్‌ సెక్యూరిటీల్లో కలిపి రూ.88,813 కోట్లుగా ఉంటే, అక్టోబర్‌ చివరికి రూ.97,784 కోట్లకు చేరాయి. సాధారణంగా ఎఫ్‌పీఐ పెట్టుబడుల ధోరణిని పీ నోట్ల పెట్టుబడులు అనుసరిస్తుంటాయి. అక్టోబర్‌ నాటికి వచ్చిన పీనోట్ల మొత్తం పెట్టుబడుల్లో రూ.88,490 కోట్లు ఈక్విటీల్లో, రూ.9,105 కోట్లు డెట్‌లో, రూ.190 కోట్లు హైబ్రిడ్‌ సెక్యూరిటీల్లోకి వచ్చాయి. ‘‘ఈ ఏడాది, వచ్చే ఏడాది ప్రపంచంలో భారత్‌ అత్యంత వేగంగా వృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థ అనే విషయంలో అంతటా ఏకాభిప్రాయం ఉంది. (శాంసంగ్‌ మరో గెలాక్సీ 5జీ స్మార్ట్‌ఫోన్‌ వచ్చేస్తోంది: ఫీచర్లు, ధర)

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నిదానించినప్పటికీ, భారత్‌ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. ఇది విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. రూపాయి స్థిరంగా ఉండడం విదేశీ ఇన్వెస్టర్లలో నమ్మకం కలిగిస్తోంది’’అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ వీకే విజయ్‌కుమార్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు