భారీ లాభాలతో మొదలైన స్టాక్‌ మార్కెట్లు

18 May, 2021 11:05 IST|Sakshi

ముంబై: గత కొన్ని రోజులుగా భారత్‌లో కరోనా కేసుల్లో నిర్దిష్టమైన తగ్గుదల నమోదవుతున్న నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో మొదలయ్యాయి. మంగళవారం ఉదయం 9.35 గంటల సమయానికి సెన్సెక్స్‌ 50,161 వద్ద, నిఫ్టీ 15, 102 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఇక హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌(యూకేలో సేవలు విస్తరించాలనుకుంటున్న తరుణంలో), బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా స్టీల్ లాభాల్లో పయనిస్తుండగా, భారతీ ఎయిర్‌టెల్‌ నష్టాల బాటపట్టింది.

ఇదిలా ఉండగా.. అమెరికన్‌ డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపీ మారకం విలువ 73.20 వద్ద ఉంది.  కాగా దేశంలో కోవిడ్‌ కేసుల్లో తగ్గుదలతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు, డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన 2డీజీ ఔషధం విడుదల కావడం వంటి పరిణామాలు మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపుతున్నాయి. దీంతో దేశీ మార్కెట్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. ఇక గడిచిన  24 గంటల్లో భారత్‌లో 2,63,533 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 4,329 కోవిడ్‌ మరణాలు సంభవించాయి. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు