మార్కెట్లు ప్లస్‌- ఈ చిన్న షేర్లు అదుర్స్‌

23 Oct, 2020 14:59 IST|Sakshi

సెన్సెక్స్‌ 131 పాయింట్లు అప్‌- 40,690 వద్ద ట్రేడింగ్‌

చిన్నతరహా కౌంటర్లకు భారీ డిమాండ్‌- పలు షేర్లు హైజంప్‌

జాబితాలో ఐబీ ఇంటిగ్రేటెడ్‌, మ్యూజిక్‌ బ్రాడ్‌క్యాస్ట్‌

ఎంటీఎన్‌ఎల్‌, మెనన్‌ బేరింగ్స్‌, ఆర్బిట్‌ ఎక్స్‌పోర్ట్స్‌, సంఘి ఇండస్ట్రీస్‌

ఒక రోజు బ్రేక్‌ తదుపరి తిరిగి దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 131 పాయింట్లు పెరిగి 40,690కు చేరగా.. నిఫ్టీ 41 పాయింట్లు బలపడి 11,937 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా మార్కెట్లను మార్కెట్లను మించి భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం జోరందుకుంది. జాబితాలో ఐబీ ఇంటిగ్రేటెడ్‌, మ్యూజిక్‌ బ్రాడ్‌క్యాస్ట్‌, మెనన్‌ బేరింగ్స్‌, ఆర్బిట్‌ ఎక్స్‌పోర్ట్స్‌, సంఘి ఇండస్ట్రీస్‌, ఎంటీఎన్‌ఎల్‌ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం.. 

ఇండియాబుల్స్‌ ఇంటిగ్రేటెడ్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 6 శాతం ఎగసి రూ. 57 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 88,500 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 31,000 షేర్లు చేతులు మారాయి.

మ్యూజిక్‌ బ్రాడ్‌క్యాస్ట్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకి రూ. 21.35 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 27,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 8.57 లక్షల షేర్లు చేతులు మారాయి.

ఎంటీఎన్‌ఎల్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకి రూ. 11 సమీపంలో ఫ్రీజయ్యింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 1.3 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 10.24 లక్షలకుపైగా షేర్లు చేతులు మారాయి.

మెనన్‌ బేరిం‍గ్స్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకి రూ. 53 సమీపంలో ఫ్రీజయ్యింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 6,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 39,500 షేర్లు చేతులు మారాయి.

ఆర్బిట్‌ ఎక్స్‌పోర్ట్స్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 11 శాతం దూసుకెళ్లి రూ. 66 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 71 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 2,700 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 8,500 షేర్లు చేతులు మారాయి.

సంఘి ఇండస్ట్రీస్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 8.3 శాతం ర్యాలీతో రూ. 29 సమీపంలో ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 92,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 4.49 లక్షల షేర్లు చేతులు మారాయి.

మరిన్ని వార్తలు