Stock Market: వరుస నష్టాలకు బ్రేక్‌!

25 Oct, 2021 16:15 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల వరుస నష్టాలకు నేడు బ్రేక్‌ పడింది. ఉదయం స్తబ్దుగా ప్రారంభమైన సూచీలు తొలుత ఒడిదుడికులను ఎదుర్కొన్న ఆ తర్వాత లాభాల్లో ముగిశాయి. త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, చైనాలో మళ్లీ కేసులు వెలుగులోకి రావడం, చమురు ధరల పెరగడం వంటి కారణాలు సూచీలను కొంత కలవరపెట్టాయి. అయితే, కీలక రంగాల్లో కొనుగోళ్ల మద్దతు, బ్యాంకింగ్ పేర్ల మద్దతుతో సూచీలు లాభాలలో ముగిశాయి. ముగింపులో, సెన్సెక్స్ 145.43 పాయింట్లు(0.24%) పెరిగి 60967.05 వద్ద ఉంటే, నిఫ్టీ 10.50 పాయింట్లు(0.06%) పెరిగి 18125.40 వద్ద ఉంది. 

నేడు డాలరుతో రూపాయి మారకం విలువ 75.08 వద్ద ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, టెక్ మహీంద్రా, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌యూఎల్‌ షేర్లు ప్రధాన నిఫ్టీ గెయినర్లలో ఉన్నాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఆటో, మారుతీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, నెస్లే ఇండియా, ఐటీసీ షేర్లు నష్టపోయాయి. ఒక్క బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ షేర్లు మినహా అన్ని రంగాలు నష్టాలు చవిచూశాయి.

(చదవండి: మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్.. అదిరిపోయే స్పీడ్, రేంజ్!)

మరిన్ని వార్తలు