కన్సాలిడేషన్‌లో మార్కెట్లు- ఆటో స్పీడ్‌

27 Nov, 2020 09:49 IST|Sakshi

118 పాయింట్లు మైనస్‌- 44,142కు సెన్సెక్స్‌

27 పాయింట్లు క్షీణించి 12,960 వద్ద కదులుతున్న నిఫ్టీ

ఆటో, మీడియా‌, రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్స్‌ ప్లస్‌‌- మెటల్‌ వీక్‌

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1 శాతం అప్

ముంబై, సాక్షి: డిసెంబర్‌ డెరివేటివ్‌ సిరీస్‌ తొలిరోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య ప్రారంభమయ్యాయి. కన్సాలిడేషన్‌ బాటలో సాగుతున్నాయి.  ప్రస్తుతం సెన్సెక్స్‌ 118 పాయింట్లు క్షీణించి 44,142 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 27 పాయింట్లు తక్కువగా 12,960 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 44,407 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకగా.. 44,124 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక నిఫ్టీ 13,035-12,957 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నేడు క్యూ2(జులై- సెప్టెంబర్‌) జీడీపీ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొన్నారు.  

మెటల్‌ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఆటో, రియల్టీ, మీడియా, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్‌ 1.6-0.5 శాతం మధ్య బలపడగా.. మెటల్‌ 0.35 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్‌, ఎన్‌టీపీసీ, ఐషర్‌, గెయిల్‌, బజాజ్‌ ఆటో, బ్రిటానియా, టెక్‌ మహీంద్రా, మారుతీ, ఏషియన్‌ పెయింట్స్‌, దివీస్ ల్యాబ్స్‌ 4-1.4 శాతం మధ్య ఎగశాయి. అయితే పవర్‌గ్రిడ్‌, హిందాల్కొ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఆర్‌ఐఎల్‌, యాక్సిస్‌, శ్రీ సిమెంట్‌, టీసీఎస్‌, టాటా స్టీల్‌, ఎయిర్‌టెల్‌ 2-0.4 శాతం మధ్య బలహీనపడ్డాయి. 

ఐజీఎల్‌ జూమ్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో ఐజీఎల్ ‌11 శాతం దూసుకెళ్లగా.. ఎంజీఎల్‌, భెల్‌, కేడిలా హెల్త్‌కేర్‌, బాలకృష్ణ, శ్రీరామ్‌ ట్రాన్స్‌, సెయిల్‌, అపోలో టైర్‌, గోద్రెజ్‌ సీపీ 9-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు బాష్‌, ఐసీఐసీఐ లంబార్డ్‌, ఐబీ హౌసింగ్‌, జిందాల్‌ స్టీల్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఇన్‌ఫ్రాటెల్ 1.4-1 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,276 లాభపడగా.. 556 మాత్రమే నష్టాలతో ట్రేడవుతున్నాయి.

ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్‌మెంట్స్‌
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,027 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 3,400 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. బుధవారం ఎఫ్‌పీఐలు నామమాత్రంగా రూ. 24 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా..  డీఐఐలు రూ. 1,840 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 4,563 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా.. డీఐఐలు . 2,522 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన విషయం విదితమే. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా