మార్కెట్లపై అమ్మకాల పిడుగు

4 Sep, 2020 09:39 IST|Sakshi

655 పాయింట్లు పతనం-38,336కు సెన్సెక్స్‌

191 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ-11,337 వద్ద ట్రేడింగ్‌

ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ 2.5-1 శాతం మధ్య డౌన్‌

బీఎస్‌ఈలో 2 శాతం క్షీణించిన మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు

నిఫ్టీ దిగ్గజాలలోఇన్‌ఫ్రాటెల్‌, బ్రిటానియా మాత్రమే లాభాల్లో..!

టెక్‌ దిగ్గజాలలో వెల్లువెత్తిన అమ్మకాలతో గురువారం యూఎస్‌ మార్కెట్లు పతనంకాగా.. దేశీయంగానూ సెంటిమెంటుకు షాక్‌ తగిలింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడటంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు సైతం కుప్పకూలాయి. సెన్సెక్స్‌ 655 పాయింట్లు పడిపోయి 38,336కు చేరగా.. నిఫ్టీ 191 పాయింట్లు కోల్పోయి 11,337 వద్ద ట్రేడవుతోంది. ఇటీవల ఆకాశమే హద్దుగా సరికొత్త రికార్డులను తాకుతున్న అమెరికా టెక్నాలజీ స్టాక్స్‌లో ట్రేడర్లు లాభాల స్వీకరణకు తెరతీసినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ప్రభావం దేశీయంగానూ కనిపిస్తున్నట్లు తెలియజేశారు.

నేలచూపులతో
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ 2.5-1 శాతం మధ్య డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్‌ప్రాటెల్‌, బ్రిటానియా మాత్రమే అదికూడా 1 శాతం స్థాయిలో బలపడ్డాయి. ఇతర బ్లూచిప్స్‌లో జీ, ఐసీఐసీఐ, హిందాల్కో, ఎస్‌బీఐ, కొటక్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌, యాక్సిస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, గ్రాసిమ్‌, ఐషర్‌, అదానీ పోర్ట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా మోటార్స్‌ తదితరాలు 3-1.5 శాతం మధ్య నష్టపోయాయి.

ఒక్కటి మాత్రమే
డెరివేటివ్స్‌లోనూ టొరంట్‌ ఫార్మా 0.2 శాతం బలపడగా.. ఐసీఐసీఐ ప్రు, చోళమండలం, ఐడియా, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఎన్‌ఎండీసీ, పేజ్‌, అదానీ ఎంటర్‌, మ్యాక్స్‌ ఫైనాన్స్‌, ఐబీ హౌసింగ్‌, సెయిల్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, భెల్, డీఎల్‌ఎఫ్‌ 5-3 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 2 శాతం చొప్పున నీరసించాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1380 నష్టపోగా.. 363 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి.

మరిన్ని వార్తలు