లాభాలతో మొదలై నష్టాలలోకి

9 Oct, 2020 09:50 IST|Sakshi

77 పాయింట్లు డౌన్‌- 40,106కు సెన్సెక్స్‌ 

15 పాయింట్లు నీరసించిన నిఫ్టీ- 11,820 వద్ద ట్రేడింగ్

మెటల్‌, ఫార్మా, ఆటో అప్‌- రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ డీలా

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.4 శాతం ప్లస్‌

మరోసారి హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 77 పాయింట్లు క్షీణించి 40,106కు చేరింది. నిఫ్టీ 15 పాయింట్లు తక్కువగా 11,820 వద్ద ట్రేడవుతోంది. సహాయక ప్యాకేజీపై తిరిగి చర్చలు ప్రారంభంకానున్న అంచనాలతో గురువారం యూఎస్‌ మార్కెట్లు 0.8 శాతం స్థాయిలో బలపడ్డాయి. నేడు ఆర్‌బీఐ పాలసీ సమీక్షను చేపట్టనున్న నేపథ్యంలో మార్కెట్లు ఒడిదొడుకులను చవిచూస్తున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 40,322-40,092 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. 

మెటల్స్‌ జోరు
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మెటల్‌, ఫార్మా, ఆటో 1.6-0.6 శాతం మధ్య లాభపడ్డాయి. రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ 0.4-0.2 శాతం చొప్పున డీలా పడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో హిందాల్కో, టాటా స్టీల్‌, ఎయిర్‌టెల్‌, ఎంఅండ్‌ఎం, ఎల్‌అండ్‌టీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐషర్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, మారుతీ, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టైటన్‌, శ్రీ సిమెంట్‌, హీరో మోటో, ఐసీఐసీఐ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ 3.6-0.5 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే హెచ్‌యూఎల్‌, యూపీఎల్‌, నెస్లే, ఆర్‌ఐఎల్‌, టీసీఎస్‌, గ్రాసిమ్‌, టెక్‌ మహీంద్రా, కోల్‌ ఇండియా 1-0.4 శాతం మధ్య డీలాపడ్డాయి.

ఐటీ జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో ఎల్‌ఐసీ హౌసింగ్‌, సెయిల్, జిందాల్‌ స్టీల్‌, నాల్కో, ఇండిగో, యూబీఎల్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, పీఎఫ్‌సీ, వేదాంతా, మదర్‌సన్, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, కేడిలా హెల్త్, అపోలో హాస్పిటల్స్‌, మణప్పురం 5.3-1.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, ఐడిఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్‌, బెర్జర్‌ పెయింట్స్‌, డీఎల్‌ఎఫ్‌, జీఎంఆర్‌, పిడిలైట్‌, అంబుజా సిమెంట్‌, డాబర్‌, పిరమల్‌ 1.7-0.9 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.4 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 873 షేర్లు లాభపడగా.. 851 నష్టాలతో ట్రేడవుతున్నాయి.

మరిన్ని వార్తలు