నష్టాలతో మొదలైనా.. లాభాల్లో మార్కెట్లు

20 Oct, 2020 09:44 IST|Sakshi

154 పాయింట్లు అప్‌- 40,586కు సెన్సెక్స్‌ 

41 పాయింట్లు బలపడి 11,914 వద్ద ట్రేడవుతున్న నిఫ్టీ

ఐటీ, ఆటో, మీడియా, రియల్టీ రంగాలు ప్లస్‌లో

ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా వీక్‌

బీఎస్‌ఈ మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.2 శాతం అప్‌

విదేశీ ప్రతికూలతల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపుతో ప్రారంభమయ్యాయి. వెనువెంటనే నష్టాలను వీడి లాభాలలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 154 పాయింట్లు పుంజుకుని 40,586కు చేరింది. నిఫ్టీ సైతం 41 పాయింట్లు బలపడి 11,914 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 40,617-40,306 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనైంది. నిఫ్టీ 11,922- 11,837 పాయింట్ల మధ్య ఆటుపోట్లను చవిచూసింది. గత రెండు రోజుల్లో మార్కెట్లు ర్యాలీ చేయడంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగినట్లు నిపుణులు తెలియజేశారు. దీంతో ఆటుపోట్లు నమోదవుతున్నట్లు వివరించారు. 

ఐటీ జోరు
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఐటీ, ఆటో, రియల్టీ, మీడియా 1.2-0.4 శాతం మధ్య లాభపడగా.. బ్యాంకింగ్‌, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ 0.5 శాతం స్థాయిలో నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో హెచ్‌సీఎల్‌ టెక్‌, శ్రీ సిమెంట్‌, టెక్‌ మహీంద్రా, ఐషర్‌, టీసీఎస్‌, విప్రో, ఎల్‌అండ్‌టీ, ఎయిర్‌టెల్‌, అల్ట్రాటెక్‌, ఇన్ఫోసిస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎస్‌బీఐ లైఫ్‌ 2.5-0.7 శాతం మధ్య ఎగశాయి. అయితే బ్రిటానియా, ఓఎన్‌జీసీ,ఇండస్‌ఇండ్‌, ఎస్‌బీఐ, ఐవోసీ, హిందాల్కో, ఐసీఐసీఐ, నెస్లే, టాటా మోటార్స్‌, కొటక్‌ బ్యాంక్‌, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫిన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, సిప్లా, యాక్సిస్‌ 4.5-0.5 శాతం మధ్య డీలాపడ్డాయి.

ఏసీసీ అప్
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో ఏసీసీ, ఇన్ఫ్రాటెల్‌, అంబుజా, బాలకృష్ణ, జీ, మైండ్‌ట్రీ, ఎక్సైడ్‌, అదానీ ఎంటర్‌, నౌకరీ, కోఫోర్జ్‌ 3.2-1 శాతం మధ్య లాభపడ్డాయి. కాగా.. మరోపక్క బీవోబీ, బంధన్‌ బ్యాంక్‌, అపోలో హాస్పిటల్స్‌, కేడిలా హెల్త్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, నాల్కో2-1 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.2 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 720 లాభపడగా.. 619 నష్టాలతో ట్రేడవుతున్నాయి.

మరిన్ని వార్తలు