మార్కెట్లు బోర్లా- ఈ చిన్న షేర్లు భలేభలే

30 Oct, 2020 14:49 IST|Sakshi

162 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్‌

పలు మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ లాభాల పరుగు

జాబితాలో టీవీఎస్‌ మోటార్‌, వైభవ్‌ గ్లోబల్‌ లిమిటెడ్

‌బజాజ్‌ హెల్త్‌కేర్‌, ధని సర్వీసెస్‌, ఆసమ్‌ ఎంటర్‌ప్రైజ్‌ లిమిటెడ్‌

ఆటుపోట్ల మధ్య దేశీ స్టాక్‌ మార్కెట్లు క్షీణ పథంలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 162 పాయింట్లు తక్కువగా 39,588కు చేరగా.. నిఫ్టీ 44 పాయింట్లు బలహీనపడి 11,627 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ కొన్ని మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా నష్టాల మార్కెట్లోనూ భారీ లాభాలతో దూసుకెళుతున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం జోరందుకుంది. జాబితాలో టీవీఎస్‌ మోటార్‌, వైభవ్‌ గ్లోబల్‌ లిమిటెడ్‌, బజాజ్‌ హెల్త్‌కేర్‌, ధని సర్వీసెస్‌, ఆసమ్‌ ఎంటర్‌ప్రైజ్‌ లిమిటెడ్‌ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం.. 

టీవీఎస్‌ మోటార్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 7 శాతం జంప్‌చేసి రూ. 450 వద్ద  ట్రేడవుతోంది. తొలుత రూ. 461 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 62,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 2.04 లక్షల షేర్లు చేతులు మారాయి.

వైభవ్‌ గ్లోబల్‌ లిమిటెడ్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 6.4 శాతం లాభపడి రూ. 1,979 వద్ద  ట్రేడవుతోంది. తొలుత రూ. 2,040 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం కేవలం 1,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 4,000 షేర్లు చేతులు మారాయి.

బజాజ్‌ హెల్త్‌కేర్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 9 శాతం దూసుకెళ్లి రూ. 545 వద్ద  ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 590 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 43,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 2.6 లక్షల షేర్లు చేతులు మారాయి. 

ధని సర్వీసెస్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 5.5 శాతం జంప్‌చేసి రూ. 194 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో పాక్షిక చెల్లింపుల ఈ షేరు మరింత అధికంగా 12 శాతం పెరిగి రూ. 93కు చేరింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 74,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 45,000 షేర్లు చేతులు మారాయి.

ఆసమ్‌ ఎంటర్‌ప్రైజ్‌ లిమిటెడ్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 11 శాతం పురోగమించి రూ. 55 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 5,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 4,200 షేర్లు చేతులు మారాయి.

మరిన్ని వార్తలు