మార్కెట్ల క్రాష్‌: రూ. 7 లక్షల కోట్లు మటాష్‌

12 Apr, 2021 12:38 IST|Sakshi

1700 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్‌, ‘బ్లాక్‌ మండే’

అమ్మకాల సెగ 48 వేల దిగువకు సెన్సెక్స్‌

 రూ. 6.86 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల  సంపద ఆవిరి

సాక్షి,ముంబై: దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ ఇన్వెస్టర్ల కొంపముంచుతోంది. రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లో కూడా రికార్డు స్థాయిలో అమ్మకాలు వెల్లువెత్తాయి. సోమవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ ఏకంగా 1700 పాయింట్లకు పైగా కుప్పకూలింది. దీంతో కేవలం 15 నిమిష్లాలో దలాల్‌ స్ట్రీట్‌లో మునుపెన్నడూ లేని విధంగా 7లక్షల కోట్ల మేర పెట్టుబడిదారుల సంపద ఆవిరైంది. ఫలితంగా బీఎస్ఇ-లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 6,86,708.74 కోట్ల రూపాయల నుంచి 2,02,76,533 కోట్లకు పడిపోయింది.

ముఖ్యంగా బ్యాంకింగ్‌ రంగ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్ అత్యధికంగా 7 శాతం నష్టపోయింది. ఎస్‌బీఐ, బజాజ్ ఫైనాన్స్ యాక్సిస్ బ్యాంక్ కూడా ఇదే వరుసలో ఉన్నాయి. దీంతో కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలోనే  రూ. 6.86 లక్షల కోట్ల సంపద హారతి  కర్పూరంలా కరిగిపోయింది. కరోనా రెండో దశలో శరవేంగా విస్తరిస్తోంది. మహారాష్ట్ర, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో రికార్డు స్థాయి కేసుల నమోదు ఇన్వెస్టర్లను వణికిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విస్తరణను అడ్డుకునేందుకు పూర్తి లాక్‌డౌన్‌ తప్పదనే భయాలు వెంటాడుతున్నాయి. దీంతో సెన్సెక్స్‌ 1745 పాయింట్లు కుప్పకూలి 48 వేల దిగువకు చేరింది. అటు నిఫ్టీ కూడా 526 పాయింట్ల నష్టంతో 14313 వద్ద కొనసాగుతోంది. మరోవైపు రానున్న పారిశ్రామికోత్పత్తి సూచి, మార్చి నెల సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. అలాగే నాలుగవ క్వార్టర్‌ ఫలితాలు, ముఖ్యంగా వారంలో ఐటీ మేజర్ల ఫలితాలు ప్రభావితం చేయనున్నాయని, వీటిని దృష్టిలో ఉంచుకోవాలని రిలయన్స్ సెక్యూరిటీస్ స్ట్రాటజీ  హెడ్ బినోద్ మోడీ సూచించారు. 

మరిన్ని వార్తలు