మారుతీ దూకుడు: టాప్‌ సెల్లింగ్‌ కారు ఇదే!

అమ్మకాల్లో సత్తా చాటిన మారుతీ సుజుకీ 

 వరుసగా నాలుగో ఏడాది మారుతి హవా

తొలి ఐదు స్థానాలు మారుతీ కంపెనీ మోడళ్ల సొంతం

సాక్షి, ముంబై: కార్ల విక్రయాల్లో వరుసగా నాలుగో ఏడాది మారుతీ సుజుకీ సత్తా చాటింది. గడిచిన ఆర్థిక సంవత్సరం(2020–21)లో జరిగిన కార్ల అమ్మకాల్లో తొలి ఐదు స్థానాలను మారుతీ కంపెనీ మోడళ్లే దక్కించుకున్నాయి. ఈ ఐదు మోడళ్లలో స్విఫ్ట్‌ కారు అత్యధికంగా అమ్ముడై తొలి స్థానాన్ని దక్కించుకుంది.(రెండో దశకు ఎయిరిండియా విక్రయం)

2020–21 ఏడాదిలో మొత్తం 1.72 లక్షల స్విఫ్ట్‌ కార్లు అమ్ముడుపోయాయి. ఈ తర్వాత స్థానాల్లో వరుసగా ఇదే కంపెనీకి చెందిన బాలెనో(1.63 లక్షలు), వేగనార్‌(1.60 లక్షలు), ఆల్టో(1.59 లక్షలు), డిజైర్‌(1.28 లక్షలు) మోడళ్లు నిలి చాయి.  5 మోడళ్లు మొత్తం అమ్మకాలు ప్యాసింజర్‌ కార్ల విక్రయాల్లో 30 శాతాన్ని ఆక్రమించాయి. ఇతర కంపెనీల నుంచి పోటీ ఉన్నప్పటికీ.., మారుతీ సుజుకీ చెందిన ఐదు ప్యాసింజర్‌ వాహన మోడల్స్‌ తొలి ఐదు స్థానాలను దక్కించుకోవడం గర్వంగా ఉందని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీవాస్తవ తెలిపారు. (అంచనాలను మించిన పరోక్ష పన్నులు)

Author: కె. రామచంద్రమూర్తి
మరిన్ని వార్తలు