కొత్త కారు కొనాలనుకునేవారికి షాకింగ్ న్యూస్

19 Jan, 2021 10:56 IST|Sakshi

న్యూఢిల్లీ: మీరు ఈ కొత్త ఏడాదిలో కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అయితే.. మీకు ఒక షాకింగ్ న్యూస్. దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతి సుజుకీ కార్ల ధరలను పెంచింది. గత నెలలో ప్రకటించిన విదంగానే ఇప్పుడు తమ వివిధ మోడళ్ల ధరలను పెంచేసింది. మారుతి సుజుకి కార్ల ధరలను దేశవ్యాప్తంగా రూ.34,000 వరకు పెంచింది. కొత్తగా పెరిగిన ధరలు వెంటనే దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయని సంస్థ పేర్కొంది. ధరల ప్రధాన కారణం పెరిగిన ఉత్పాదక వ్యయాలు అని స్పష్టం చేసింది. 

కరోనా మహమ్మారి ప్రభావం తర్వాత డిసెంబర్ నెలలో మారుతి కార్ల అమ్మకాలు 20 శాతం మేర పెరిగినట్టు సంస్థ ప్రకటించింది. మొత్తంగా చెప్పాలంటే ఈ ఏడాది కొత్త కారు కొనేవారు అదనంగా మరింత సొమ్మును చెల్లించాలి. కార్ల తయారీదారి మారుతి సుజుకి పెరిగిన ధరల వివరాలను అధికారిక జాబితాను పంచుకోకపోయిన, కొన్ని పెరిగిన కారు ధరల వివరాలు బయటకి వెలువడ్డాయి. ఈ నివేదికల ప్రకారం, మారుతి సుజుకి పెరిగిన కార్ల జాబితా ఈ క్రింది విదంగా ఉంది. 

  • మారుతి సుజుకి టూర్ ఎస్: రూ.5,061 వరకు
  • మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో: రూ.7,000 వరకు
  • మారుతి సుజుకి విటారా బ్రెజ్జా: రూ.10,000 వరకు
  • మారుతి సుజుకి డిజైర్: రూ.12,500 వరకు
  • మారుతి సుజుకి ఆల్టో 800: రూ.14,000 వరకు
  • మారుతి సుజుకి సెలెరియో: రూ.19,400 వరకు
  • మారుతి సుజుకి వాగన్-ఆర్: రూ.23,200 వరకు
  • మారుతి సుజుకి ఈకో: రూ.24,200 వరకు
  • మారుతి సుజుకి స్విఫ్ట్: రూ.30,000 వరకు
  • మారుతి సుజుకి ఎర్టిగా: రూ.34,000 వరకు
మరిన్ని వార్తలు