మారుతీ కుటుంబం 2.5 కోట్లు

31 Jan, 2023 04:40 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్యాసింజర్‌ కార్ల విక్రయాల్లో భారత్‌లో అగ్రశేణి కంపెనీ మారుతీ సుజుకీ.. 2023 జనవరి 9 నాటికి దేశీయంగా 2.5 కోట్ల కార్లను విక్రయించి సరికొత్త రికార్డులతో దూసుకెళ్తోంది. అప్పటి మారుతీ ఉద్యోగ్‌ 1983 డిసెంబర్‌ నుంచి అమ్మకాలను ప్రారంభించింది. కంపెనీ 2012 ఫిబ్రవరి నాటికి 1 కోటి యూనిట్ల మైలురాయిని చేరుకుంది. 2019 జూలై కల్లా 2 కోట్ల యూనిట్ల విక్రయాలను సాధించింది.

జపాన్‌కు చెందిన సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ అనుబంధ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా ప్రస్తుతం దేశీయంగా 17 మోడళ్లను తయారు చేసి విక్రయిస్తోంది. ఎస్‌యూవీలకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ఈ విభాగంలో తన స్థానాన్ని నిలబెట్టుకోవాలని సంస్థ కృతనిశ్చయంతో ఉంది. క్రమంగా ఎస్‌యూవీ మోడళ్లను ప్రవేశపెడుతోంది. మరోవైపు హైబ్రిడ్, సీఎన్‌జీ విభాగంలోనూ విస్తరిస్తోంది. ఇప్పటి వరకు కంపెనీ భారత్‌లో 21 లక్షల యూనిట్ల హైబ్రిడ్, సీఎన్‌జీ వాహనాలను విక్రయించింది. 

మరిన్ని వార్తలు