మారుతీ సుజుకీ రికార్డ్‌.. విదేశాలకు 25 లక్షల కార్లు..

30 Mar, 2023 08:52 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ 25 లక్షల యూనిట్ల ఎగుమతుల మార్కును దాటి కొత్త రికార్డు సృష్టించింది. 1986–87 నుంచి కంపెనీ పలు దేశాలకు వాహనాల సరఫరా ప్రారంభించింది. తొలుత పొరుగున ఉన్న బంగ్లాదేశ్, నేపాల్‌కు ఈ కార్లు అడుగుపెట్టాయి. ప్రస్తుతం దాదాపు 100 దేశాలకు ఇక్కడ తయారైన కార్లు ఎగుమతి అవుతున్నాయని మారుతీ సుజుకీ ప్రకటించింది.

(హోండా నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్‌ టూ వీలర్లు.. ఈవీల కోసం ప్రత్యేక ప్లాంటు!)

ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, ఆసియా, మధ్యప్రాచ్య దేశాలు వీటిలో ఉన్నాయి. భారత తయారీ శక్తి సామర్థ్యాలకు ఈ మైలురాయి నిదర్శనమని తెలిపింది. అధిక నాణ్యత, ఉన్నత సాంకేతికత, విశ్వసనీయత, పనితీరుతోపాటు అందుబాటు ధరలో లభించడంతో కంపెనీ తయారీ కార్లు విదేశీ కస్టమర్ల ఆమోదం, ప్రశంసలను పొందాయని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ తెలిపారు. భారత్‌ నుంచి అత్యధికంగా ప్యాసింజర్‌ వాహనాలను ఎగుమతి చేస్తున్న సంస్థగా నిలిచామన్నారు.

(UPI Charges: సాధారణ యూపీఐ చెల్లింపులపై చార్జీలు ఉండవు.. ఎన్‌పీసీఐ వివరణ)

మరిన్ని వార్తలు