ఈకో 10 లక్షల యూనిట్ల మార్కు

23 Feb, 2023 05:53 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఈకో వ్యాన్‌ సరికొత్త రికార్డు నమోదు చేసింది. తాజాగా 10 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని చేరుకుంది. 2010లో భారత మార్కెట్లోకి ఈకో ప్రవేశించింది. 5, 7 సీట్లు, కార్గో, టూర్, అంబులెన్స్‌ వంటి 13 వేరియంట్లలో ఇది లభిస్తుంది. వ్యాన్స్‌ విభాగంలో 94 శాతం వాటా ఈకో కైవసం చేసుకుందని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ తెలిపారు.

తొలి 5 లక్షల యూనిట్లకు ఎనమిదేళ్లు పట్టింది. మిగిలిన 5 లక్షల యూనిట్ల విక్రయాలు అయిదేళ్లలోపే పూర్తి చేశామన్నారు. 1.2 లీటర్‌ అడ్వాన్స్‌డ్‌ కె–సిరీస్‌ డ్యూయల్‌ జెట్, డ్యూయల్‌ వీవీటీ ఇంజన్‌తో ఈకో రూపుదిద్దుకుంది. మైలేజీ పెట్రోల్‌ వేరియంట్‌ లీటరుకు 20.2 కిలోమీటర్లు, ఎస్‌–సీఎన్‌జీ వేరియంట్‌ కేజీకి 27.05 కిలోమీటర్లు ఇస్తుందని కంపెనీ తెలిపింది.  

మరిన్ని వార్తలు