సుజుకీ గ్రాండ్‌ విటారా లాంచ్‌.. స్టైలిష్‌ లుక్‌, మిగతా కంపెనీలకు గట్టి పోటీ గురూ!

27 Sep, 2022 10:45 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా నుంచి మధ్యస్థాయి స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికిల్‌ గ్రాండ్‌ విటారా భారత మార్కెట్లో అడుగుపెట్టింది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర రూ.10.45 లక్షల నుంచి రూ.19.65 లక్షల మధ్య ఉంది.

మైల్డ్‌ హైబ్రిడ్‌ టెక్నాలజీతో 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజన్‌ పొందుపరిచారు. ఆరు వేరియంట్లలో మాన్యువల్, ఆటోమేటిక్‌ మోడల్స్‌లో లభిస్తుంది.

మైలేజీ వేరియంట్‌నుబట్టి లీటరుకు 21.1 కిలోమీటర్లు, స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ పవర్‌ట్రెయిన్‌ 27.97 కిలోమీటర్లు ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. హ్యుందాయ్‌ క్రెటా, కియా సెల్టోస్, టాటా హ్యారియర్‌కు ఇది పోటీ ఇవ్వనుంది.

57 వేల పైచిలుకు బుకింగ్స్‌ నమోదయ్యాయని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ ఈ సందర్భంగా తెలిపారు. మారుతీ సుజుకీ, టయోటా సంయుక్తంగా ఈ కారును అభివృద్ధి చేశాయి. మారుతీ సుజుకీ సబ్‌స్క్రైబ్‌ విధానంలో నెలకు రూ.27 వేల చందాతో గ్రాండ్‌ విటారా సొంతం చేసుకోవచ్చు.

చదవండి: Ration Card New Rules: కేంద్రం కొత్త నిబంధనలు.. ఇకపై వాళ్ల రేషన్‌ కార్డు కట్‌!

మరిన్ని వార్తలు