సెడాన్‌ అమ్మకాల్లో ఆ కారుదే అగ్రస్థానం

10 Sep, 2021 15:04 IST|Sakshi

Maruti Ciaz Sedan Car: ఇండియన్‌ మార్కెట్‌లో తనకు తిరుగు లేదని మరోసారి మారుతి నిరూపించుకుంది. మార్కెట్‌లో ఇతర కంపెనీల నుంచి తీవ్ర పోటీ నెలకొన్నా మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటున్నాయి మారుతి బ్రాండ్‌ నుంచి వస్తోన్న కార్లు. తాజాగా సెడా​న్‌ సెగ్మెంట్‌ అమ్మకాల్లో మారుతి సియాజ్‌ సంచలనం సృష్టించింది.

ఎస్‌యూవీ పోటీని తట్టుకుని
గత దశాబ్ధం కాలంగా ఇండియన్‌ మార్కెట్‌లో ఎస్‌యూవీ వెహికల్స్‌కే డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. ఎంట్రీ లెవల్‌ కార్లను మినహాయిస్తే ఎస్‌యూవీలోనే ఎక్కువ అమ్మకాలు జరుగుతున్నాయి. ఇక సెడాన్‌ సెగ్మెంట్‌కి సంబంధించిన అమ్మకాల్లో ఎలాంటి మెరుపులు ఉండటం లేదు. అలాంటి తరుణంలో మారుతి మిడ్‌రేంజ్‌ సెడాన్‌ సియాజ్‌ సానుకూల ఫలితాలు సాధించింది. 

అమ్మకాల్లో రికార్డ్‌
మారుతి సంస్థ 2014లో మిడ్‌ రేంజ్‌ సెడాన్‌గా సియాజ్‌ని మార్కెట్‌లో ప్రవేశ పెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 3 లక్షలకు పైగా సియాజ్‌ కార్ల అమ్మకాలు జరిగాయి. పోటీ సంస్థలైన స్కోడా ర్యాపిడ్‌, హ్యుందాయ్‌ వెర్నా, ఫోక్స్‌వాగన్‌ వెంటోల నుంచి పోటీ ఉన్నా తన అధిపత్యాన్ని కొనసాగించింది.

డీజిల్‌ ఆపేసినా 
మారుతి సంస్థ 2014లో డీజిల్‌ వెర్షన్‌లో సియాన్‌ని మార్కెట్‌లోకి తెచ్చినప్పుడు భారీగానే అమ్మకాలు జరిగాయి. ఆ తర్వాత డీజిల్‌ వెర్షన్‌ ఆపేసి ఇప్పుడు పెట్రోల్‌ వెర్షన్‌లోనే సియాజ్‌ను అమ్ముతోంది. ఐనప్పటికీ సేల్స్‌ బాగానే ఉన్నాయి. ‘సియాజ్‌ మార్కెట్‌కి వచ్చినప్పటి నుంచి డిజైన్‌, స్టైల్‌, కంఫర్ట్‌ ఇలా అన్ని విభాగాల్లో కస్టమర్ల ఆదరణ చూరగొంది’ అని మారుతి మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాత్సవ అన్నారు.

1.5 పెట్రోల్‌ ఇంజన్‌
ప్రస్తుతం మారుతి సియాజ్‌కి కారు 1.5 పెట్రోలు ఇంజన్‌ వెర్షన్‌లో లభిస్తోంది. 103 బ్రేక్‌ హార్స్‌ పవర్‌తో గరిష్టంగా 138 ఎన్‌ఎం టార్క్‌ని అందిస్తోంది. స్టాండర్డ్‌, ఆటోమేటిక్‌ గేర్‌ వెర్షన్లలో ఈ కారు మార్కెట్‌లో అందుబాటులో ఉంది. 510 లీటర్ల బూట్‌ స్పేస్‌, 2,650 గ్రౌండ్‌ క్లియరెన్సులు సియాజ్‌ ప్రత్యేకతలు.

చదవండి : Ford: ప్లీజ్‌ మమ్మల్ని వదిలేసి వెళ్లొద్దు!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు