త్వరలో అన్ని కార్లలో హైబ్రీడ్‌ టెక్నాలజీ: మారుతీ సుజుకీ

4 Jul, 2022 12:00 IST|Sakshi

న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల టెక్నాలజీలపై మరింతగా దృష్టి పెట్టే దిశగా ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) వచ్చే 5–7 ఏళ్లలో తమ అన్ని కార్ల మోడల్స్‌లోనూ హైబ్రీడ్‌ సాంకేతికతను వినియోగించాలని యోచిస్తోంది.

బ్యాటరీ ఎలక్ట్రిక్‌ వాహనాలు, సీఎన్‌జీ కార్లు, ఇథనాల్‌.. బయో సీఎన్‌జీ అనుకూల ఇంజిన్లపై మరింత దృష్టి పెట్టనున్నట్లు సంస్థ చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ సీవీ రామన్‌ తెలిపారు. రాబోయే అయిదు నుంచి ఏడేళ్లలో ప్రతీ మోడల్‌లో ఎంతో కొంత గ్రీన్‌ టెక్నాలజీ ఉంటుందని చెప్పారు.

>
మరిన్ని వార్తలు