Maruti Suzuki బంపర్‌ ఆఫర్స్‌: అన్ని మోడల్స్‌పై డిస్కౌంట్స్‌

6 Oct, 2022 10:13 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ టాప్‌ వాహన తయారీ సంస్థ  మారుతి సుజుకి  తన కస్టమర్ల కోసం భారీ ఫెస్టివ్‌ ఆఫర్లను అందిస్తోంది.  సీఎన్‌జీ  మోడల్‌ సహా,  పలు కార్ల మోడళ్లపై సుమారు రూ. 56,000 వరకు తగ్గింపును అందిస్తోంది. అరేనా షోరూమ్‌లు ఈ (అక్టోబర్) నెలలో తగ్గింపు ధరలకు  అందుబాటులో ఉంటాయి.  ఇందులో కార్పొరేట్, క్యాస్‌,  ఎక్స్చేంజ్  ఆఫర్‌ కూడా   ఉన్నాయి.  ముఖ్యంగా  మారుతీ సుజుకి ఆల్టో 800, స్విఫ్ట్‌ ,వ్యాగన్-ఆర్,  సెలెరియో, డిజైర్‌ సహా పలు  కార్లు ఇపుడు తగ్గింపు ధరల్లో  లభ్యం. 


మారుతి సుజుకి డిజైర్
మారుతి సుజుకి  ఏఎంటీ వెర్షన్‌లపై రూ. 52,000 దాకా తగ్గింపు అందిస్తోంది. ఇందులో  రూ. 35,000 నగదు తగ్గింపు, రూ. 7,000 కార్పొరేట్ డిస్కౌంట్లు  రూ. 10,000 ఎక్స్చేంజ్ బోనస్‌లు ఉన్నాయి.  అలాగే మాన్యువల్ ట్రాన్స్మిషన్ మోడల్‌ కార్లపై రూ. 17,000  తగ్గింపు లభ్యం. 

మారుతీ సుజుకి S-ప్రెస్సో
రూ. 35,000 నగదు తగ్గింపు. రూ. 6,000 కార్పొరేట్, రూ. 15,000 ఎక్స్చేంజ్ ప్రోత్సాహకాలున్నాయి. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో S Presso హై-రైడింగ్ హ్యాచ్‌బ్యాక్‌కు మొత్తం తగ్గింపును రూ. 56,000కి  తగ్గింపు లభిస్తుంది. అలాగే  S ప్రెస్సో AMT మోడల్‌లకు మొత్తం రూ. 46వేలు డిస్కౌంట్‌ లభ్యం.

మారుతీ సుజుకి స్విఫ్ట్
అక్టోబర్ నెలలో, మారుతి సుజుకి స్విఫ్ట్ యొక్క ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ (AMT) వెర్షన్‌లు రూ. 47,000 మొత్తం ప్రయోజనాలకు అర్హమైనవి, స్విఫ్ట్ యొక్క మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌లు రూ. 30,000 విలువైన మొత్తం ప్రయోజనాలకు అర్హులు. ఆల్టో 800కి మొత్తం రూ. 36,000 తగ్గింపు ఉంటుంది.

మారుతి సుజుకి వ్యాగన్-ఆర్
మారుతి సుజుకి డ్యూయల్‌జెట్ టెక్నాలజీతో వచ్చిన రెండు ఎకనామిక్ పెట్రోల్ కార్ల (1.0 ,1.2 లీటర్లు) వ్యాగన్ ఆర్‌ కొనుగోలుదారులు మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మోడల్‌లలో రూ. 31,000 ఆదా చేయవచ్చు. అదనంగా, మారుతీ రూ. 15,000 ధర తగ్గింపును కూడా అందిస్తోంది.  సీఎన్‌జీ బేస్ మోడల్‌, టాప్-టైర్ వేరియంట్‌పై రూ. 5000 తగ్గింపు.

మారుతి సుజుకి ఆల్టో K10
కొత్తగా విడుదల చేసిన ఆల్టో కె10 బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ ఆటోమేటిక్ మరియు మాన్యువల్ వెర్షన్‌లపై రూ.39,500 తగ్గింపును అందిస్తోంది. ఇందులో రూ. 17,500 విలువైన రూ. 7,000 నగదు తగ్గింపు , రూ. 15,000 విలువైన ఎక్స్ఛేంజ్ బోనస్‌, కార్పొరేట్ రివార్డు ఉన్నాయి.

మరిన్ని వార్తలు