Maruti Suzuki: మారుతి కస్టమర్లకు మరోషాక్‌, 11 వేల కార్లు రీకాల్‌

24 Jan, 2023 17:04 IST|Sakshi

సాక్షి,ముంబై:  దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ  మారుతి సుజుకి  మరోసారి తన కస్టమర్లకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది.  తన పాపులర్‌ మోడల్‌ గ్రాండ్‌ విటారా 11,177 కార్ల‌ను రీకాల్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ కార్ల‌లో రేర్ సీట్ బెల్ట్ మౌంటింగ్ బ్రాకెట్స్ స‌మ‌స్య కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.  గ‌త ఏడాది ఆగ‌స్టు ఎనిమిది నుంచి న‌వంబ‌ర్ 15 వ‌ర‌కు త‌యారైన గ్రాండ్ విటారా కార్ల‌ను రీకాల్ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది.

రేర్ సీట్ బెల్ట్ మౌంటింగ్ బ్రాకెట్ల‌లో స‌మ‌స్య త‌లెత్తింది. దూర ప్రాంతాల‌కు వెళ్లిన‌ప్పుడు రేర్ సీట్ బెల్ట్ లూజ్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని, దానివ‌ల్ల పనితీరు దెబ్బ తింటుంద‌ని మారుతి తెలిపింది. గ‌త ఆగ‌స్టు – నవంబ‌ర్ మ‌ధ్య త‌యారైన గ్రాండ్ విటారా కార్లు కొనుగోలు చేసిన వినియోగ‌దారుల‌కు త‌మ డీల‌ర్ల ద్వారా స‌మాచారం అందుతుంద‌ని తెలిపింది. దెబ్బ తిన్న విడి భాగాల‌ను ఉచితంగా రీ ప్లేస్ చేస్తామ‌ని  మారుతి ప్రకటించింది.

కాగా  ఎయిర్‌బ్యాగ్ లోపం కార‌ణంగా వివిధ మోడ‌ళ్ల‌కు చెందిన‌ 17,362 కార్లు ఇటీవల మారుతి రీకాల్ చేసింది. ముఖ్యంగా ఆల్టో కే10, ఎస్‌-ప్రెస్సో, ఈకో, బ్రెజా, బాలెనో, గ్రాండ్ విటారా మోడ‌ల్ కార్లు  ఉన్న సంగతి తెలిసిందే. 
 

మరిన్ని వార్తలు