అమ్మకాలలో దూసుకెళ్తున్న మారుతి సుజుకి..!

1 Sep, 2021 19:35 IST|Sakshi

ప్రముఖ ఆటోమేకర్ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ భారత మార్కెట్‌లో అమ్మకాల విషయంలో దూసుకెళ్తుంది. ఆగస్టులో మొత్తం 1,30,699 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసినట్లు మారుతి సుజుకి ప్రకటించింది. ఇందులో 1,05,775 యూనిట్ల దేశంలో అమ్మితే, 4,305 యూనిట్ల ఇతర ఓఈఎంలకు అమ్మినట్లు పేర్కొన్నారు. అలాగే, ఆగస్టులో 20,619 యూనిట్లను ఎగుమతి చేసింది. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ల కొరత కారణంగా ఆగస్టులో అమ్మకాల మీద ప్రభావం పడినట్లు మారుతి సుజుకి ఒక అధికారిక ప్రకటనలో వివరించింది. కాంపోనెంట్ల కొరత ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి సాధ్యమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆటోమేకర్ పేర్కొంది.(చదవండి: నిరుద్యోగులకు అమెజాన్ తీపికబురు!)

కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2020 ఆగస్టులో అమ్మకాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు కంపెనీ తెలిపింది. మారుతి సుజుకి ఇండియా ఆగస్టు 2020 లో 1,24,624 యూనిట్లను అమ్మినట్లు పేర్కొంది. మినీ సబ్ సెగ్మెంట్ గత ఏడాది ఇదే నెలలో 19,709 యూనిట్లు అమ్మితే, 2021 ఆగస్టులో 20,461 యూనిట్ల అమ్మకాలను జరిపినట్లు పేర్కొంది.

యుటిలిటీ వెహికల్స్ సెగ్మెంట్ కూడా గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాల్లో పెరుగుదలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే నెలలో 21,030 యూనిట్లతో పోలిస్తే ఈ ఏడాది 2021 ఆగస్టులో సంస్థ 24,337 యూనిట్లను విక్రయించింది. ఈ సెగ్మెంట్ లో ఎర్టిగా, ఎస్-క్రాస్, వితారా బ్రెజ్జా, ఎక్స్ ఎల్ 6, జిప్సీ వంటి మోడల్స్ ఉంటాయి. 

మరిన్ని వార్తలు