ఇండియాలో బెస్ట్‌ సెల్లింగ్‌ కారు ఇదే!

23 Jan, 2021 15:09 IST|Sakshi

టాప్‌ కారుగా మారుతి స్విఫ్ట్‌ 

యువతరం మనసు దోచుకున్న స్విఫ్ట్‌

కోవిడ్‌ సంక్షోభంలోనూ 1,60,700 యూనిట్ల విక్రయాలు

సాక్షి,ముంబై: 2020 ఏడాదిలో ప్రముఖకార్ల కంపెనీ మారుతి సుజుకికి చెందిన వాహనం అత్యధిక అమ్ముడైన కారుగా నిలిచింది. కోవిడ్-19 సంక్షోభంలో కూడా మారుతి స్విప్ట్‌ టాప్‌ బ్రాండ్‌గా ఖ్యాతి దక్కించుకుంది. 2020 ఏడాదిలో లక్షా అరవై వేలకుపైగా విక్రయాలతో ఈ రికార్డు సాధించింది.  టెక్‌ సావీ ఫీచర్లు, సరియైన ధర, స్పోర్టి డిజైన్‌లతో యువతరం మనుసు దోచుకుందని కంపెనీ వెల్లడించింది. స్విఫ్ట్ కస్టమర్లలో 53 శాతానికి పైగా 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారేనని కంపెనీ తెలిపింది. 

గత ఏడాది 1,60,700 యూనిట్లతో స్విఫ్ట్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే కార్‌గా నిలిచిందని మారుతి సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్అండ్‌ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ శనివారం వెల్లడించారు. 15 సంవత్సరాలుగా 2.3 మిలియన్లకు పైగా వినియోగదారులతో దేశంలో అత్యధికంగా అమ్ముడైన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా ఉందని పేర్కొన్నారు. 2005లో లాంచ్‌ చేసిన మారుతి స్విఫ్ట్‌  ఇప్పటికి 23 లక్షల యూనిట్ల మైలురాయిని కూడా దాటేసిందన్నారు. ఇది 2010 లో 5 లక్షల మైలురాయిని, 2013 లో 10 లక్షలను, 2016 లో 15 లక్షలను దాటిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

మరిన్ని వార్తలు