Maruti Suzuki: మహీంద్రా థార్‌కు పోటీగా మారుతి నుంచి అదిరిపోయే కార్‌...!

16 Oct, 2021 15:30 IST|Sakshi

Maruti Suzuki Teases New Off Road Car: ఆఫ్ రోడ్స్‌ వాహనాల్లో మహీంద్రా థార్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. మహీంద్రా థార్‌కు పోటీగా ప్రముఖ దిగ్గజ ఆటోమొబైల్‌ కంపెనీలు ఆఫ్‌​ రోడ్స్‌ ఎస్‌యూవీ కార్లపై ఫోకస్‌ పెట్టాయి. భారత మార్కెట్లలోకి థార్‌కు పోటీగా ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ ఫోర్స్‌ గుర్ఖా పేరుతో ఆఫ్‌ రోడ్‌ ఎస్‌యూవీని లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మహీంద్రా థార్‌కు పోటీగా మారుతి సుజుకి భారత మార్కెట్లలోకి ‘జిమ్నీ’ పేరుతో ఆఫ్‌ రోడ్‌ ఎస్‌యూవీను త్వరలోనే లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. 

మహీంద్రా థార్‌కు తీసిపోకుండా అదే స్టైల్‌తో జిమ్నీ రానుంది. మారుతి తీసుకువస్తోన్న ఆఫ్‌ రోడ్‌ ఎస్‌యూవీ కస్టమర్లను ఇట్టే కట్టిపడేస్తుంది. మారుతి సుజుకీ జిమ్నీకి సంబంధించిన టీజర్‌ను సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌లో లాంచ్‌ చేసింది. అన్ని రకాల భూభాగాల్లో అడ్వెంచరస్‌ డ్రైవింగ్‌ అనుభూతిని వాహనదారులకు కచ్చితంగా అందిస్తోందని మారుతి సుజుకీ పేర్కొంది. 
చదవండి: డావో ఎలక్ట్రిక్‌ స్కూటర్.. భలే ఉంది కదూ!


ఇండియా నుంచి ఇతర దేశాలకు...
మారుతి సుజుకీ జిమ్నీ ఎస్‌యూవీ 3 డోర్‌ వెర్షన్‌తో రానుంది. ఈ కారును హర్యానాలోని మాన్నేసర్‌లో ప్లాంట్‌లో తయారుచేశారు. ఇక్కడి నుంచే ఇతర దేశాలకు కూడా ఎగుమతికానుంది. భారతీయుల కోసం సపరేట్‌గా 5 డోర్‌ వెర్షన్‌తో రానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. 

ఇంజన్‌ విషయానికి వస్తే..!
మారుతి సుజుకీ జిమ్నీ ఇంటర్నేషనల్‌ వెర్షన్‌ 1.4-లీటర్ మైల్డ్-హైబ్రిడ్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో రానుంది. అయితే ఇండియన్‌ వెర్షన్‌ జిమ్నీ 1.5-లీటర్ కె 15 బి పెట్రోల్ ఇంజిన్‌ తో రానుంది. ఇక్కడ విశేషమేమిటంటే..విటారా బ్రెజ్జా, సియాజ్, ఎర్టిగా, ఎక్స్‌ఎల్ 6 మోడల్స్‌లో ఇదే ఇంజిన్‌ను మారుతి అమర్చింది. 6000 ఆర్‌పిఎమ్ వద్ద 103 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది,  4400 ఆర్‌పిఎమ్ వద్ద 138 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందిస్తోంది.  ఈ ఎస్‌యూవీ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు ఆప్షనల్‌ 4-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ ట్రాన్స్‌మిషన్‌ గేర్‌బాక్స్‌లో కూడా అందుబాటులో ఉంది. కాగా ఈ కారు ధర ఇంకా తెలియాల్సి ఉంది. 

చదవండి: రికార్డ్‌ సేల్స్‌, ప్రతిరోజు 400 అపార్ట్‌మెంట్ల రిజిస్ట్రేష‌న్లు

మరిన్ని వార్తలు