హల్‌చల్‌ చేస్తోన్న మారుతి సుజుకీ వ్యాగన్‌ఆర్‌ నయా మోడల్‌..! ధర ఎంతంటే..?

4 Apr, 2022 20:20 IST|Sakshi

ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్‌ పోర్ట్‌ఫోలియోలో సరికొత్త వేరియంట్‌ను లాంచ్‌ చేసింది. ఈ కారు వ్యాగన్‌ఆర్‌ టూర్‌ హెచ్‌3గా పిలవనున్నట్లు తెలుస్తోంది. 

మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్‌ టూర్‌హెచ్‌3 సరికొత్త డిజైన్‌తో రానుంది. ఈ కారులో హ్యాచ్‌బ్యాక్ బాడీ కలర్ బంపర్స్, వీల్ సెంటర్ క్యాప్ అండ్‌ బ్లాక్-అవుట్ ఓఆర్‌వీఎంను అమర్చారు. కారు ఇంటీరియర్ విషయానికి వస్తే...ఇందులో ఫ్రంట్ క్యాబిన్ ల్యాంప్స్, టికెట్ హోల్డర్‌తో డ్రైవర్ సైడ్ సన్‌వైజర్, ఫ్రంట్ అండ్‌ రియర్ హెడ్‌రెస్ట్ ఉన్నాయి. అంతేకాకుండా సైడ్ ఆటో డౌన్ ఫంక్షన్, మాన్యువల్ ఏసీ, వెనుక పార్శిల్ ట్రే, రిక్లైనింగ్ అండ్‌ ఫ్రంట్ స్లైడింగ్ సీట్లు కలిగిన ఫ్రంట్ పవర్ విండోలతో రానుంది. 

గతంలో మారుతి సుజుకి పలు వేరియంట్లకు టూర్‌ వెర్షన్‌ మోడల్స్‌ను తీసుకొచ్చింది. ఇప్పుడు డిజైర్‌, ఎర్టిగా టూర్‌ వెర్షన్‌ మోడల్స్‌కు మారుతి సుజుకీ వ్యాగన్‌ఆర్‌ కూడా వచ్చి చేరింది. వ్యాగన్‌ఆర్‌ టూర్‌ హెచ్‌3 పెట్రోల్‌, సీఎన్‌జీ వేరియంట్లలో రానుంది.   పెట్రోల్‌ వేరియంట్‌ ధర రూ. 5.39 లక్షలు కాగా, సీఎన్‌జీ వేరియంట్‌ రూ. 6.34 లక్షలుగా ఉంది. 

సేఫ్టీ విషయానికి వస్తే..!
మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్‌ టూర్‌ హెచ్‌3 కారులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీ టెక్నాలజీతో ఎబీఎస్‌ బ్రేకింగ్‌ సిస్టమ్స్‌, స్పీడ్‌ లిమిటింగ్‌ ఫంక్షన్‌, రియర్‌ పార్కింగ్‌ సెన్సార్స్‌, సెంట్రల్‌ డోర్‌ లాకింగ్‌తో రానుంది. 

ఇంజిన్‌ విషయానికి వస్తే..!
మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్‌ టూర్‌ హెచ్‌3 పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్లలో రానుంది. పెట్రోల్‌ పవర్ ట్రైన్‌తో..1.0-లీటర్, 3-సిలిండర్, K10C పెట్రోల్ ఇంజన్‌తో 5,500rpm వద్ద 64bhp శక్తిని, 3,500rpm వద్ద 89Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. ఇది మారుతి సుజుకి డ్యూయల్‌జెట్ సాంకేతికతను ఐడిల్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్‌తో పొందుతుంది. దీంతో ఈ కారు 25.4km/l మైలేజ్‌ను అందిస్తుంది. 

సీఎన్‌జీ వేరియంట్‌లో డ్యూయల్‌ జెట్‌ సాంకేతికత లేదు. ఈ వెర్షన్ 5,300rpm వద్ద 56bhp శక్తిని, 3,400rpm వద్ద 82Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో రానుంది. ఈ వేరియంట్‌ గరిష్టంగా 34.73km/kg మైలేజ్‌ను అందించనుంది. 

చదవండి: హల్‌చల్‌ చేస్తోన్న టాటా మోటార్స్‌ కొత్త ఎలక్ట్రిక్‌ కారు..! లాంచ్‌ ఎప్పుడంటే..?

మరిన్ని వార్తలు