తాజ్‌మహల్‌ సైజులో గ్రహశకలం..! భూమి వైపుగా..!

29 Nov, 2021 19:18 IST|Sakshi

A Massive Asteroid Rushing Towards Earth Orbital Path NASA Warns: తాజ్‌మహల్‌ సైజులో ఉన్న ఓ గ్రహాశకలం భూకక్ష్య వైపుగా దూసుకువస్తోన్నట్లు అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గుర్తించింది. ఈ గ్రహశకల పరిమాణం లండన్‌లోని బిగ్ బెన్ గడియారం కంటే రెట్టింపు పరిమాణంలో ఉంది. ఈ గ్రహశకలం తాజ్ మహల్‌తో పోల్చినట్లయితే సుమారు 240 అడుగుల ఎత్తును కల్గి ఉంది. ఈ గ్రహశకలానికి 1994 డబ్ల్యూ ఆర్‌12గా నామకరణం చేశారు. ఈ గ్రహశకలాన్ని పాలోమార్ అబ్జర్వేటరీలో 1994లో అమెరికన్‌ ఖగోళ శాస్త్రవేత్త కరోలిన్ ఎస్‌. షూమేకర్ కనుగొన్నారు. 

భూమికి ఏమైనా నష్టం ఉందా..!
1994డబ్ల్యూఆర్‌12 గ్రహశకలం నుంచి ఏలాంటి ముప్పు లేదని నాసా పేర్కొంది. 1994లో ఈ గ్రహశకలాన్ని గుర్తించినప్పుడు  భూమి నుంచి సుమారు 3.8 మిలియన్‌ మైళ్ల దూరంలో ఉంది.  ఇది సోమవారం నవంబర్‌ 29న భూమి నుంచి అత్యంత సమీపంగా వెళ్లనున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.  

ఒకవేళ భూమిని ఢీకొడితే..!
ఈ గ్రహశకలం నుంచి ఏలాంటి ముప్పు లేనప్పటీకి ఒకవేళ భూమిని ఢీ కొడితే సుమారు 77 మెగాటన్నుల టీఎన్‌టీను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ నగరం హిరోషిమాపై వేసిన అణు బాంబు కంటే 3,333 రెట్లు ఎక్కువ శక్తిని విడుదల చేయనుంది.
చదవండి: నాసా డార్ట్‌ ప్రయోగం.. ఎలన్‌ మస్క్‌ ఆసక్తికర రీట్వీట్‌

మరిన్ని వార్తలు