నవ్వితే చాలు అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ అవుతాయ్‌!

22 May, 2022 12:57 IST|Sakshi

నవ్వు గురించి ఓ సినిమాలో "నవ్వవయ్యా బాబూ నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుందనే" పాట విని ఉంటాం. ఆ పాట సంగతి అటుంచితే టెక్నాలజీ పుణ్యమా అని.. ఇప్పుడు నిజంగానే నవ్వితే చాలు అకౌంట్‌లో ఉన్న మన సొమ్ము మాయం కానుంది. మన అకౌంట్‌ నుంచి మరో అకౌంట్‌కు ట్రాన్స్‌ ఫర్‌ కానుంది. ఇది వినడానికి నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ ఇది అక్షరాల నిజం. ఎందుకంటే!
 

ఫైనాన్షియల్‌ సర్వీస్‌ దిగ్గజం మాస్టర్‌ కార్డ్‌ యూజర్లకు అదిరిపోయే టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. మాస్టర్‌ కార్డ్‌ వినియోగదారులు పేమెంట్‌ చేసేందుకు బయో మెట్రిక్‌ తంబ్‌ లేదంటే నవ్వితే చాలు కార్డ్‌, స్మార్ట్‌ ఫోన్‌, టెలిఫోన్‌తో అవసరం లేకుండా మరో అకౌంట్‌కు డబ్బుల్ని ట్రాన్స్‌ ఫర్‌ చేయోచ్చు. ప్రస్తుతం ఈ సరికొత్త ఫీచర్‌ను బ్రెజిల్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. త్వరలో ప్రపంచ వ్యాప్తంగా ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది.  

కొత్త టెక్నాలజీతో బెన్‌ఫిట్స్‌ ఏంటంటే!
ఈ కొత్త టెక్నాలజీతో కరోనాలాంటి వైరస్‌ల నుంచి వినియోగదారులు సురక్షితంగా ఉంచడంతో పాటు సెక్యూర్‌గా మరింత ఫాస్ట్‌గా డబ్బుల్ని మాస్టర్‌ కార్డ్‌ తెలిపింది. నేటి ఆధునిక జీవన శైలికి తగ్గట్లుగా వేగంగా పేమెంట్‌ సేవలందించేందుకు ఈ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చాం. ఇదే సమయంలో సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేశామని మాస్టర్‌ కార్డ్‌ సైబర్‌ అండ్‌ ఇంటెలిజెన్స్‌ ప్రెసిడెంట్‌ అజయ్‌ భల్లా తెలిపారు. 

కేబీవీ రీసెర్చ్‌ ఏం చెబుతోంది
2026 నాటికి ఈ కాంటాక్ట్‌ లెస్‌ బయో మెట్రిక్‌ టెక్నాలజీ బిజినెస్‌ 18.6బిలియన్‌ డాలర్లకు చేరుకోనుందని మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ కేబీవీ రీసెర్చ్‌ తెలిపింది. అయితే మాస్టర్‌ కార్డ్‌ అందుబాటులోకి తెచ్చిన ఈ కొత్త సౌకర్యం ఇప్పటికే వీసా, అమెజాన్‌లు అభివృద్ధి చేశాయని తెలిపింది.

చదవండి👉ఏటీఏం కార్డ్‌ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త!

మరిన్ని వార్తలు