Matter Aera Electric Bike: ఈ బైక్ కావాలా? ఇదిగో ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేసుకోండి!

28 Apr, 2023 09:48 IST|Sakshi

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ అందుబాటులోకి వచ్చిన తరువాత మనకు ఏం కావాలన్నా వెంటనే ఆర్డర్ పెట్టస్తాం.. అది మనకు డోర్ డెలివరీ అయిపోతుంది. అయితే ఇప్పుడు ఇందులో కేవలం నిత్యావసర వస్తువులు మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ బైకులు కూడా ఈ సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

దేశీయ మార్కెట్లో ఇప్పటికే విక్రయానికి ఉన్న మ్యాటర్ (Matter) ఎలక్ట్రిక్ బైకుని ఫ్లిప్‌కార్ట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. మ్యాటర్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌తో ఏర్పరచుకున్న భాగస్వామ్యం ద్వారా ఈ విధంగా విక్రయించడానికి నిర్ణయించింది. కాబట్టి మ్యాటర్ ఎరా ఎలక్ట్రిక్ బైక్ కావాలనుకునే వారు ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేసుకోవచ్చు.

భారతదేశంలో మ్యాటర్ ఎరా ఎలక్ట్రిక్ బైక్ ధర రూ. 1.44 లక్షలు. ఇది మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. డిజైన్ పరంగా ఈ బైకులు ఒకే విధంగా ఉన్నప్పటికీ రేంజ్ విషయంలో కొంత వ్యత్యాసం ఉంటుంది. టాప్ మోడల్ 150 కిమీ రేంజ్ అందిస్తుంది. మిగిలిన అన్ని మోడల్స్ 125కిమీ రేంజ్ మాత్రమే అందిస్తాయి.

(ఇదీ చదవండి: భారీగా పెరిగిన అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ధరలు - కొత్త ధరలు ఇలా!)

మ్యాటర్ ఎరా ఎలక్ట్రిక్ బైక్ మంచి డిజైన్ కలిగి ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ టర్న్ సిగ్నెల్స్ ఇతర మోడల్స్ మాదిరిగా కాకుండా ఫ్యూయెల్ ట్యాంక్ మీద ఏర్పాటు చేశారు. స్ప్లిట్ సీటు, క్లిన్ ఆన్ హ్యాండిల్ బార్లు, పిలియన్ సీటు కోసం స్ల్పిట్ గ్రబ్ రైల్ వంటి వాటితో పాటు బై ఫంక్షనల్ ఎల్ఈడీ హెడ్ లైట్ కొత్తగా ఉంటుంది. ఇవన్నీ చూసేవారికి ఎంతగానో ఆకట్టుకుంటాయి.

ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ కొత్త బైక్ 7.0 ఇంచెస్ LCD టచ్ స్క్రీన్ ఇన్స్ట్రుమెంట్ పొందుతుంది. ఇది బైక్ గురించి రైడర్‌కి కావలసిన సమాచారం అందిస్తుంది. ఇందులో రిమోట్ లాక్/అన్‌లాక్, జియో ఫెన్సింగ్, లైవ్ లొకేషన్ ట్రాకింగ్, వెహికల్ హెల్త్ మానిటరింగ్, ఛార్జింగ్ స్టేటస్, పుష్ నావిగేషన్ వంటివి ఉన్నాయి.

(ఇదీ చదవండి: కొత్త యాడ్‌లో రచ్చ చేసిన సమంతా.. వీడియో వైరల్)

దేశీయ విఫణిలో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకి డిమాండ్ పెరుగుతున్న తరుణంలో కొనుగోలుదారులకు మరింత చేరువలో ఉంచాలనే ఉద్దేశ్యంతో ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా మ్యాటర్ ఎరా ఎలక్ట్రిక్ బైక్ విక్రయిస్తున్నట్లు కంపెనీ సీఈఓ మోహన్ లాల్ భాయ్ అన్నారు. గతంలో కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా విక్రయించిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సలహాలు తప్పకుండా మాతో పంచుకోండి.

మరిన్ని వార్తలు