దూసుకొచ్చిన మ్యాటర్ ఎనర్జీ: అత్యాధునిక ఫీచర్స్‌తో ఎలక్ట్రిక్ బైక్‌ 

21 Nov, 2022 19:12 IST|Sakshi

సాక్షి, ముంబై: ఎలక్ట్రిక్ బైక్స్‌కు పెరుగుతున్న ఆదరణ, డిమాండ్‌ నేపథ్యంలో దేశీయ మార్కెట్లోకి మరో కంపెనీ దూసుకొచ్చింది. తాజాగా మ్యాటర్ ఎనర్జీ (Matter Energy) తన తొలి ఎలక్ట్రిక్ బైక్‌ను దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. అద్భుతమైన డిజైన్, అత్యాధునిక ఫీచర్స్‌తో మ్యాటర్ ఎనర్జీ తన తొలి ఎలక్ట్రిక్  బైక్‌ను  ఆవిష్కరించింది.  

ఫీచర్లు
ఈ బైక్‌లో అమర్చిన 10.5 kW ఎలక్ట్రిక్ మోటారు  520 Nm టార్క్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది.  4-స్పీడ్ గేర్‌బాక్స్‌,  5 kWh లిక్విడ్-కూల్డ్ బ్యాటరీని జతచేసింది. ఇది ఒక్కసారి ఛార్జ్‌పై 125-150 కిమీల పరిధిని అందజేస్తుందని కంపెనీ చెప్పింది. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే, ఇది స్టాండర్డ్,  ఫాస్ట్ ఛార్జింగ్ రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం 5 గంటలు అని కంపెనీ పేర్కొంది. 

ఎల్‌ఈడీ లైట్లు, స్ప్లిట్ సీట్లు, క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్లు , స్ప్లిట్ రియర్ గ్రాబ్ రైల్‌తో  స్పోర్టీ స్ట్రీట్ బైక్ డిజైన్‌న్‌తో ఆకట్టుకుంటోంది.. ట్యాంక్ ఏరియాలో 5లీటర్ గ్లోవ్‌బాక్స్ ఉంది, ఇందులోనే ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంటుంది. ఇంకా  7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో వస్తుంది, ఇది టర్న్-బై-టర్న్ నావిగేషన్, నోటిఫికేషన్ అలర్ట్‌లు , మ్యూజిక్ ప్లేబ్యాక్ వంటి ఫీచర్లను అందిస్తుంది. ఇది ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్‌లకు కూడా మద్దతు ఇస్తుంది. స్పోర్ట్, ఎకో, సిటీ మోడ్స్‌లో గ్రే అండ్ నియాన్, బ్లూ అండ్ గోల్డ్, బ్లాక్‌ అండ్ గోల్డ్, రెడ్/బ్లాక్/వైట్ కలర్స్‌లో అందుబాటులోకి రానుంది.  2023 మొదటి త్రైమాసికంలో బుకింగ్స్, డెలివరీలు 2023 ఏప్రిల్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ధర: ధరను కంపెనీ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ  సుమారు రూ. 1.75 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుందని అంచనా.

మరిన్ని వార్తలు