మ్యాక్స్‌ ఫిన్‌కు సుమితోమో వాటా

29 Nov, 2022 13:57 IST|Sakshi

ఐఆర్‌డీఏఐ  అనుమతి

న్యూఢిల్లీ: మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో మిగిలిన వాటాను కొనుగోలు చేసేందుకు బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ తాజాగా మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ను అనుమతించింది. దీంతో మిత్సు­యి సుమితోమో కంపెనీకి గల 5.17 శాతం ­వా­­­టా­ను రానున్న రెండు వారాల్లోగా సొంతం చేసుకునే వీలున్నట్లు మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌ పేర్కొంది.

షేరుకి రూ. 85 ధరలో 9.91 కోట్ల మ్యాక్స్‌ లైఫ్‌ షేర్లను కొనుగోలు చేయనున్నట్లు మాతృ సంస్థ వెల్లడించింది. ఈ కొనుగోలు తదుపరి మ్యాక్స్‌ లైఫ్‌లో మాతృ సంస్థ వాటా 87 శాతానికి బలపడనుంది. గతంలో మ్యాక్స్‌ లైఫ్‌లో మిత్సుయి సుమితోమో 25.48 శాతం, మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌ 72.52 శాతం చొప్పున వాటాలను కలిగి ఉండేది.  

>
మరిన్ని వార్తలు