గుడ్ న్యూస్.. భారీగా ఏజెంట్ల నియామకం చేపట్టిన మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్

1 Aug, 2021 21:21 IST|Sakshi

ఇన్స్యూరెన్స్ రంగంలో ఉద్యోగాలు చేరాలని అనుకునే వారికి శుభవార్త. ఇటీవల ఇన్స్యూరెన్స్ కంపెనీలు భారీగా ఉద్యోగాలను నియమించుకుంటున్నాయి. ఏజెంట్ల స్థాయి నుంచి ఆఫీసర్ల స్థాయి వరకు భారీ స్థాయిలో ఉద్యోగ నియామక ప్రక్రియ చేపడుతున్నాయి. తాజాగా మ్యాక్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ భారీ స్థాయిలో ఉద్యోగాల ఏజెంట్ల నియామక ప్రక్రియ చేపట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 40,000 ఏజెంట్ అడ్వైజర్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మ్యాక్స్ లైఫ్ ప్రకటించింది. నియామక ప్రక్రియ మొత్తం డిజిటల్ పద్ధతిలో చేస్తామని కంపెనీ ప్రకటించింది.

ఈ కొత్త ప్రక్రియ ద్వారా ఎఫ్ వై 21లో 23,000 మందికి పైగా ఏజెంట్ సలహాదారులను నియమించుకోనుంది. మాక్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ వి. విశ్వనాథ్ ఒక ప్రకటనలో ఇలా.. "మా ఏజెన్సీ శ్రామిక శక్తి డిజిటల్ నియామక ప్రయాణం మా ఏజెన్సీలో అత్యున్నత నాణ్యత, ప్రతిభగల వారిని నియమించుకోవడానికి మాత్రమే కాదు, మొత్తం ఆన్ బోర్డింగ్ ప్రయాణంలో ఎక్కువ చురుగ్గా, వేగంగా సమర్థవంతంగా నియామక ప్రక్రియ చేపట్టడానికి ఉపయోగపడుతుందని నిర్ధారించింది" అని అన్నారు. డిజిటల్ నియామక ప్రక్రియ కింద మాక్స్ లైఫ్ నాణ్యమైన ఏజెంట్ నియామకాన్ని ప్రారంభించడానికి సమగ్రమైన 'వెబ్-టు-రిక్రూట్ ప్రోగ్రామ్'ను ప్రారంభించింది. దీంతో పాటు కొత్త ట్రైనింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రోగ్రామ్ 'మ్యాక్స్ లైఫ్ ఏస్ టాక్' ప్రారంభించింది. ఇందులో మ్యాక్స్ లైఫ్ ఏజెంట్ అడ్వైజర్ల స్ఫూర్తిదాయకమైన కథలు ఉంటాయి. ఇవి ఇతర ఏజెంట్లకు స్ఫూర్తినిస్తాయి.
 

మరిన్ని వార్తలు