ఈ కంపెనీ కార్లపై రూ.1.5 లక్షల వరకు ధర తగ్గింపు!

9 May, 2021 18:48 IST|Sakshi

హ్యుందాయ్ ఇండియా కొన్ని ప్రత్యేక మోడళ్లపై ఈ నెలలో ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఆఫర్ కింద కారు మోడల్, వేరియంట్‌లను బట్టి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు లాభం పొందవచ్చు. సాంట్రో, ఆరా, గ్రాండ్ ఐ10 నియోస్, ఐ20, కోనా ఎలక్ట్రిక్ వెహికల్ కు సంబందించిన మోడళ్లపై డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో డిస్కౌంట్ తో పాటు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ వంటివి ఉంటాయి. మే 1 నుండి మే 31 మధ్య కొన్న కార్లపై మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. మీరు ఈ ఆఫర్‌ను ఆన్‌లైన్‌లో లేదా దగ్గరలో ఉన్న షో రూమ్ లో ఏ కారుపై ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారో తెలుసుకోవచ్చు.

హ్యుందాయ్ సాంట్రో:
హ్యుందాయ్ సాంట్రోపై వినియోగదారులు రూ.35,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్ పెట్రోల్ మోడల్ కార్లపై మాత్రమే వర్తిస్తుంది. సాన్ట్రోకు గరిష్టంగా రూ .20,000 నగదు తగ్గింపు, రూ.10,000 విలువైన ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ .5 వేలకు మంచి కార్పొరేట్ డిస్కౌంట్ ఇవ్వబడుతుంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్:
నియోస్ హ్యాచ్‌బ్యాక్‌పై గరిష్టంగా 50 వేలు ఆదా చేయవచ్చు. ఈ కారుపై రూ.35,000నగదు తగ్గింపు, రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌, కార్పొరేట్ డిస్కౌంట్‌ రూ.5 వేలు వరకు లభిస్తుంది. 

హ్యుందాయ్ ఆరా: 
హ్యుందాయ్ ప్రస్తుతం ఆరాపై రూ.45,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.30,000 నగదు తగ్గింపు, రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.5 వేల కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి.

హ్యుందాయ్ ఐ20: 
భారత మార్కెట్లో హ్యుందాయ్ ఐ20ను 2020 ఏడాది చివరలో విడుదల చేశారు. మొదటిసారిగా దీనిపై డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో రూ.15 వేల వరకు ప్రయోజనాలు లభిస్తాయి. వీటిలో రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ .5 వేల కార్పొరేట్ బోనస్ ఉన్నాయి.

హ్యుందాయ్ కోనా ఈవీ:
హ్యుందాయ్ రూ.1.5 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తున్న కారు హ్యుందాయ్ కోనా ఈవీ. హ్యుందాయ్ నుంచి భారత మార్కెట్లో వచ్చిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఇదే. ఈ క్రాస్ఓవర్ ఈవీకి రూ .1.5 లక్షల నగదు తగ్గింపు లభిస్తుంది. ఈ కారును హ్యుందాయ్ దేశంలో లభించే మొత్తం వాహన శ్రేణిలో 60 శాతానికి పైగా ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. సంస్థ ఆకర్షణీయమైన ఫైనాన్స్ పథకాన్ని కూడా అందిస్తోంది.

చదవండి:

డీమార్ట్ లాభాలు ఎంత పెరిగాయో తెలుసా?

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు