RIL 45th AGM: రిలయన్స్‌ జియో యూజర్లకు శుభవార్త!

28 Aug, 2022 16:52 IST|Sakshi

రిలయన్స్‌ జియో యూజర్లకు శుభవార్త. ఆగస్ట్‌ 29 మధ్యాహ్నం 2గంటలకు (సోమవారం) రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వ సభ్య సమావేశం(ఏజీఎం) జరగనుంది. ఇందులో భాగంగా రిలయన్స్‌ ఇండస్ట్రీ అధినేత ముఖేష్‌ అంబానీ 7రకాలైన ప్రొడక్ట్‌ల గురించి ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.  

ఈ నేపథ్యంలో రిలయన్స్‌ ఏజీఎం సమావేశంపై ప్రముఖ టెక్‌ బ్లాగర్‌ అభిషేక్‌ యాదవ్‌ స్పందించారు. ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన నివేదికలు, అభిషేక్‌ ట్విట్‌ ప్రకారం.. రేపు మధ‍్యాహ్నం జరిగే రిలయన్స్‌ ఈవెంట్‌లో ముఖేష్‌ అంబానీ.. జియో బుక్‌ ల్యాప్‌ ట్యాప్‌, జియో 5జీ నెట్‌ వర్క్‌ ఎప్పుడు అందుబాటులోకి రానుందో ప్రకటించనున్నారు. 

దీంతో పాటు గ్రీన్‌, ఎనర్జీ,ఐపీవో, గిగా ఫ్యాక్టరీ, జియో ట్యాగ్‌, జియో ఫోన్‌ 5జీ గురించి మీడియాకు వెల్లడించనున్నట్లు సమాచారం. దీంతో 5జీ నెట్‌ వర్క్‌ వినియోగంలోకి ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న జియో యూజర్ల ఉత్కంఠతకు రేపు తెరపడనుంది.     
   

చదవండి👉 మీ స్మార్ట్‌ ఫోన్‌ 5జీ నెట్‌ వర్క్‌కు సపోర్ట్‌ చేస్తుందా? లేదో? ఇలా చెక్ చేసుకోండి!

మరిన్ని వార్తలు