గూగుల్‌ క్రోమ్‌ యూజర్లకు అలర్ట్‌, వెంటనే ఈ ఎక్స్‌టెన్షన్స్‌ను డిలీట్‌ చేయండి!లేదంటే

1 Sep, 2022 21:23 IST|Sakshi

ప్రముఖ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ మెకాఫీ (McAfee) గూగుల్‌ క్రోమ్‌ యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. సైబర్‌ నేరస్తులు ఈ కామర్స్‌ సైట్‌లోని అఫిలియేషన్‌ లింక్స్‌ను అడ్డుపెట్టుకొని యూజర్లను ఫిషింగ్‌ సైట్లకు మళ్లిస్తున్నట్లు తెలిపింది. గూగుల్‌ క్రోమ్‌లో ఉన్న ఐదు ఎక్స్‌ టెన్షన్‌లను 1,400,000 కంటే ఎక్కువ మంది ఇన్‌ స్టాల్‌ చేసుకున్నారని, తద్వారా యూజర్ల డేటాకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వార్నింగ్‌ ఇచ్చింది.   

మెకాఫీ వెల్లడించిన ఎక్స్‌ టెన్షన్‌లలో నెట్ ఫ్లిక్స్ పార్టీ (800,000 యూజర్లు), నెట్ ఫ్లిక్స్ పార్టీ 2 (300,000 యూజర్లు), ఫ్లిప్ షోప్ ప్రైస్ ట్రాకర్ ఎక్స్ టెన్షన్ (80,000 యూజర్లు), ఫుల్ పేజీ స్క్రీన్ షాట్ క్యాప్చర్ స్క్రీన్ షాట్ (200,000 యూజర్లు), ఆటోబ్యూయ్ ఫ్లాష్ సేల్స్ (20,000 యూజర్లు) ఉన్నట్లు వెల్లడించింది.  క్రోమ్ స్టోర్లో ఎక్స్ టెన్షన్ లు లభ్యం కావడం లేదు. అయితే యూజర్లు వాటిని తమ పర్సనల్‌ కంప్యూటర్లలలో ఇన్ స్టాల్ చేసుకున్నట్లయితే, వెంటనే డిలీట్‌ చేయాలని విజ్ఞప్తి చేసింది. 

ఫిషింగ్‌ దాడులు 
తెలివి మీరిన సైబర్‌ నేరస్తులు యూజర్ నేమ్, పాస్ వర్డ్‌లను దొంగిలించేందుకు ఫిషింగ్ దాడులకు పాల్పడుతున్నారు. ఈ-కామర్స్‌ సైట్లు అందించే అఫిలియేట్‌ కమిషన్‌ లింక్స్‌ను క్లిక్‌ చేస్తే..వారికి అనుకూలమైన సైట్లకు మళ్లిస్తున్నారు. అనంతరం యూజర్లకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు, బ్యాంక్‌ డీటెయిల్స్‌ను కాజేస్తున్నారు. ఇదే విషయాన్ని మెకాఫీ గుర్తించింది. యూఆర్‌ఎల్‌ క్లిక్‌ చేస్తే అందులో అక్షర దోషాల్ని గుర్తించాలి. అక్షర దోషాలున్న లింక్స్‌ను క్లిక్‌ చేయోద్దంటూ సూచించింది.

మరిన్ని వార్తలు