Apple Too: ఆపిల్‌ మీటూ..వీళ్లకి మూడింది!

31 Aug, 2021 12:57 IST|Sakshi

థింక్‌ డిఫరెంట్‌ క్యాప్షన్‌ తో  ప్రపంచ టెక్‌ మార్కెట్‌ను శాసిస్తున్న ఆపిల్‌ మరో అడుగు ముందుకేసింది. సంస్థలో పని చేసే ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించేలా చర్యలకు సిద్ధమైంది. ఇకపై ఉద్యోగులు ఎలాంటి వేధింపులకు గురైనా ఆ ప్లాట్‌ ఫామ్‌లో ఎకరువు పెట్టేలా నిర్ణయం తీసుకుంది. 

చైనా ఈ-కామర్స్‌ దిగ్గజం అలీబాబాను లైంగిక ఆరోపణలు మాయని మచ్చని మిగుల్చుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆపిల్‌ ఈ తరహా చర్యలు తీసుకోవడం టెక్‌ ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. ఆపిల్‌ సంస్థలో వరల్డ్‌ వైడ్‌గా పనిచేస్తున్న 500 మంది ఉద్యోగుల నుంచి అభిప్రాయాల్ని సేకరించింది. అభిప్రాయాలతో పాటు జాత్యహంకారం, లింగవివక్ష, అసమానత్వం, వివక్ష, బెదిరింపు, అణచివేత, బలవంతం, దుర్వినియోగం ఇలా అన్నీ అంశాల్లో ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకుంది. #appletoo,#metto అని పిలిచే ఈ వేదికకు ఆపిల్‌ సంస్థ గ్లోబల్‌ సెక్యూరిటీ టీమ్‌లో సెక్యూరిటీ ఇంజినీర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న 'చెర్  స్కార్లెట్' ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఈ సందర్భంగా చెర్‌ స్కార‍్లెట్‌ మాట్లాడుతూ..ఆపిల్‌లో నిజమైన మార్పును చూడాలనుకుంటున్న ఆపిల్ ఉద్యోగులు పనివేళల్లో తలెత్తుతున్న సమస్యల గురించి స్పందించాలని కోరుతున్నాం.దీంతో ఆపిల్‌లో బాసిజంతో పాటు రకరకాల వేధింపులకు గురి చేస్తున్న వారికి చెక్‌ పెట్టినట్లవుతుంది' అని అన్నారు. ఇందులో మాజీ ఉద్యోగులు, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు సైతం పాల్గొనవచ్చని స్పష్టం చేశారు. 

కాగా, ఆపిల్‌ నిర్ణయంపై టెక్‌ దిగ్గజ సంస్థలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. థింక్‌ డిఫరెంట్‌తో సొంత సంస్థలో ఉద్యోగుల వేధింపుల గురించి బహిరంగంగా చర్చించడం సాధారణ విషయం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

చదవండి : ఆన్‌ లైన్‌ గేమ్స్‌: ఇక వారంలో మూడు గంటలే ఆడాలి!

మరిన్ని వార్తలు