JIO: ఇ గేమింగ్‌ టోర్నమెంట్‌.. భారీ క్యాష్‌ప్రైజ్‌

12 Nov, 2021 16:46 IST|Sakshi

MEDIATEK AND JIO GAMING MASTERS 2.0: గేమర్లకు శుభవార్త తెలిపింది జియో నెట్‌వర్క్‌! ఇండియాలో ఇ గేమ్స్‌ ఆడే వారిని ప్రోత్సహించే లక్ష్యంతో మొబైల్‌ నెట్‌వర్క్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ జియో, చిప్‌సెట్ల తయారీ సంస్థ మీడియాటెక్‌లు సంయుక్తంగా గేమింగ్‌ మాస్టర్‌ 2.ఓ పేరుతో ఆలిండియా రేంజ్‌లో గేమింగ్‌ పోటీలను నిర్వహి‍స్తున్నాయి.

‍క్యాష్‌ ప్రైజ్‌
గేమింగ్‌ మాస్టర్‌ 2.ఓ పోటీలో పాల్గొనే ప్రొఫెషనల్‌ గేమర్స్‌, ఇ గేమింగ్‌లో ఉ‍త్సాహం ఉన్నవారి కోసం భారీ క్యాష్‌ ప్రైజులు రెడీగా ఉన్నాయి. ఈ టోర్నమెంట్‌ కోసం రూ. 12.50 లక్షల వరకు ప్రైజ్‌పూల్‌ను ప్రకటించారు. బ్యాటిల్‌ గ్రౌండ్‌ మొబైల్‌ ఇండియా సిరీస్‌లో ఈ టోర్నమెంట్‌ జరగనుంది.

రిజిస్ట్రేషన్లు
గేమింగ్‌ మాస్టర్‌ 2.ఓకి సంబంధించి రిజిస్ట్రేషన్లు నవంబరు 12 నుంచి ప్రారంభం అవుతాయి. వెబ్‌పోర్టల్‌ https://play.jiogames.comకి వెళ్లి​ రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. గేమింగ్‌ మాస్టర్‌ 2.ఓ టోర్నమెంట్‌ నవంబరు 23 నుంచి జనవరి 10 వరకు జరుగుతాయి. జియో యూజర్లు, జియో నాన్‌ యూజర్లు ఈ గేమింగ్‌ టోర్నమెంట్‌లో పాల్గొనవచ్చు. ఎటువంటి పార్టిసిపేషన్‌ ఫీజు లేదు.

ఇలా చూడొచ్చు
గేమింగ్‌మాస్టర్‌ 2.ఓలో జరిగే అన్ని గేమ్స్‌ని ఆసక్తి ఉన్న వారు జియోగేమ్స్‌ వాచ్‌, జియోటీవీ హెచ్‌డీ ఈస్పోర్ట్స్‌ ఛానల్‌, ఫేస్‌బుక్‌ గేమింగ్‌, జియోగేమ్స్‌ యూట్యూబ్‌ ఛాన్సల్‌లో చూడవచ్చు.

మీడియాటెక్‌
జియో రాకతో ఇండియాలో ఇంటర్నెట్‌ యూసేజీలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. దేశంలో ప్రముఖ మొబైల్‌ నెట్‌వర్క్‌ కంపెనీగా జియో సుస్థిర స్థానం దక్కించుకుంది. మరోవైపు మీడియాటెక్‌ ప్రాసెసర్‌తో ఇండియాలో అనేక మొబైల్‌ ఫోన్లు తయారయ్యాయి. ముఖ్యంగా మీడియా టెక్‌ అందిస్తోన్న హెలియో జీ సిరీస్‌ చిప్‌సెట్లపై గేమింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఎంతో స్మూత్‌గా ఉంటుంది. కాగా 5జీ నెట్‌వర్క్‌పై మరింత సమర్థంగా గేమింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చేందుకు మీడియాటెక్‌ సంస్థ డైమెన్‌సిటీ 5జీ పేరుతో సరికొత్త చిప్‌సెట్లను అందుబాటులోకి తెచ్చింది. 

మరిన్ని వార్తలు