Covid Crisis: చేతులెత్తేసిన ప్రభుత్వాలు... ప్రజల పర్సులు ఖాళీ

21 Jun, 2021 15:35 IST|Sakshi

ప్రజలను ఆదుకోవడంతో దారుణంగా విఫలమైన కేంద్రం

కోవిడ్‌ వేళ ప్రజలకు అండగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వాలదీ అదే దారి

కరోనా చికిత్స వ్యయంలో బీహార్‌ ప్రభుత్వ వాట 10 పైసలు

కోవిడ్‌ సంక్షోభం వేళ ప్రజలకు అండగా నిలవడంతో కేంద్ర, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు దారుణంగా విఫలమయ్యాయి. ప్రజారోగ్య వ్యవస్థ ద్వారా ప్రజలను ఆదుకోవడానికి చొరవ చూపించకపోవడంతో ఎక్కువ మంది ప్రైవేటు ఆస్పత్రులనే ఆశ్రయించారు. చికిత్స కోసం ఆస్తులు అమ్ముకుని ఆర్థికంగా చితికి పోయారు. అవుటాఫ్‌ పాకెట్‌ ఎక్స్‌పెన్సెస్‌ (OOP)కి సంబంధించిన గణాంకాలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. కరోనా కోసం చేసిన ప్రతీ రూ. 100 ఖర్చులో ప్రభుత్వ వ్యయం కేవలం రూ. 37.3లకే పరిమితం అవగా ప్రజలు వ్యక్తిగతంగా చేసిన ఖర్చు రూ. 63.7 గా నమోదైంది.

అప్పుల పాలు
రోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా  దేశంలో కోట్లాది మంది ప్రజలు కరోనా బారిన పడ్డారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బెడ్లు లభించిన ఆక్సిజన్‌, రెమ్‌డెసివర్‌ వంటి మందులు బ్లాక్‌లో కొనుక్కుక్కోవాల్సిన దుస్థితి ఎదురైంది. ఆస్పత్రి ఖర్చుల కోసం కొందరు పొదుపు సొమ్ము వాడేస్తే, మరికొందరు అప్పులు చేశారు, ఆస్తులు అమ్ముకున్నారు. చివరకు కరోనా దెబ్బకు చాలా మంది ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. కేవలం సెకండ్‌వేవ్‌ కారణంగా దేశంలో 5.5  కోట్ల మంది ప్రజలు పేదలుగా మారిపోయారు.

ప్రభుత్వ వ్యయం 37.3 శాతం
కరోనా సెకండ​ వేవ్‌లో మన దేశంలో  అధికారికంగా 2.87 కోట్ల కేసులు నమోదు అయ్యాయి. వీరి చికిత్స కోసం జరిగిన వ్యయంలో ప్రభుత్వ వాటా కేవలం 37.3 శాతం ఉండగా వ్యక్తిగతంగా చేసిన ఖర్చు రూ. 62.7గా నమోదు అయ్యింది. ఇదే సమయంలో అమెరికాలో 3.34 ‍ కోట్ల కేసులు రాగా అక్కడ ప్రభుత్వ వ్యయం 89.2 శాతంగా నమోదు అయ్యింది. వ్యక్తిగత ఖర్చు కేవలం 10.8  శాతమే అయ్యింది. 


పొరుగుతో పోల్చితే
కరోనా చికిత్సకు ప్రభుత్వ పరంగా చేసిన ఖర్చులో ఇండియా కంటే పొరుగుదేశాలపై నేపాల్‌, శ్రీలంక, పాకిస్తాన్‌లు ముందున్నాయి. బంగ్లాదేశ్‌, మయన్మార్‌లు వెనుకబడ్డాయి.


బీహార్‌లో పది పైసలు
వెనుకబాటు తనానికి కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పుకునే బీహార్‌,  కరోనా చికిత్స విషయంలోనూ అదే తీరు కనబరిచింది. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా బారిన పడ్డవారికి ప్రభుత్వం తరఫున  మెరుగైన చికిత్స అందివ్వడంలో  పూర్తిగా చేతులెత్తేసింది. బీహార్‌ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కరోనా వ్యయం విషయంలో ప్రభుత్వ వాటా కేవలం 10 పైసలకే పరిమితమైంది. ఇక యోగా సర్కార్‌ తీరు ఇందుకు మినహాయింపేం కాదు, యూపీలో ప్రభుత్వ ఖర్చు రూ. 1.50కే పరిమితమైంది. 


పట్టణాల్లో పరిస్థితి
గ్రామీణ ప్రాంతాలో కరోనా వైద్యం కోసం 10 పైసల వరకు ఖర్చు పెట్టిన బీహార్‌ పట్టణ ప్రాంతాలకు వచ్చే సరికి ఆ ఖర్చును రూ. 1.70 వరకు తేగలిగింది. ఆ తర్వాత మధ్య ప్రదేశ్‌ రూ. 7.70, ఉత్తర్‌ప్రదేశ్‌ రూ. 8.80 ఖర్చు చేశాయి.  

మరిన్ని వార్తలు