ఫెస్టివల్‌ సీజన్‌ కదా.. ఆ కంపెనీ ఉద్యోగులకు 11 రోజుల సెలవులు!

22 Sep, 2022 12:29 IST|Sakshi

నగర వాసుల డైలీ లైఫ్‌ అంటే ఉదయం నుంచి రాత్రి వరకు బిజీ బిజీగా గడిపేస్తుంటారు. వారమంతా తీరిక లేకుండా ఎవరి  పనుల్లో వాళ్లు విశాంత్రి అనే మాట మరిచి వీకెండ్‌లో కాస్త చిల్‌ అవుతుంటారు. అయితే కొందరికి మాత్రం ఆ కాస్త రిలీఫ్‌ అయ్యే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఈ విషయాన్ని గమనించిన ఓ కంపెనీ తమ ఉద్యోగులు శారీరకంగానే కాకుండా మానసికంగానూ దృఢంగా ఉండాలని భావించింది. అందుకే ఫెస్టివల్‌ సమయంలో బిజీగా గడిపిన అనంతరం వారి విశ్రాంతి కోసం ప్రత్యేకంగా పనికి బ్రేక్‌ పేరుతో సెలవులు ఇచ్చింది. 


వరుస పండుగల్లో బిజీ విక్రయాలతో ప్రజలు తీరిక లేకుండా ఈ ఫెస్టివల్‌ సీజన్‌ గడుపుతారు. అందుకే తమ కంపెనీ తన ఉద్యోగుల మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే ప్రయత్నంలో, ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం మీషో వరుసగా రెండవ సంవత్సరం కూడా 11 రోజుల "రీసెట్ అండ్‌ రీఛార్జ్ విరామం"ని ప్రకటించింది.


ఈ విషయాన్ని కంపెనీ వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేసింది. అందులో.. "మేము వరుసగా రెండవ సంవత్సరం కంపెనీ-వ్యాప్తంగా 11-రోజుల విరామాన్ని ప్రకటించాం! రాబోయే పండుగ సీజన్‌తో పాటు వారి వర్క్‌ లైఫ్‌ని బ్యాలెన్స్‌ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, మీషో ఉద్యోగులకు రీసెట్ & రీఛార్జ్ అనేది కొంత అవసరం కాబట్టి వారికి అక్టోబర్ 22 నుంచి నవంబర్ 1 వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లు ట్వీట్‌ చేసింది.

చదవండి: సగం సంపద ఆవిరైంది.. సంతోషంగా ఉందంటూ పోస్ట్‌ పెట్టిన మార్క్‌ జుకర్‌బర్గ్‌!

మరిన్ని వార్తలు