Meesho Shopping Survey: ఆన్‌లైన్‌ షాపింగ్‌ అంటే ఆ ఒక్కరోజే, ఎగబడి కొనేస్తున్నారు!

27 Dec, 2022 15:01 IST|Sakshi

ఆదివారాలంటే విశ్రాంతి తీసుకోవడానికే అని భావించవచ్చు కానీ, అది ఒకప్పుడు భారతీయులు మాత్రం ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేయడానికి ఆదివారమే అత్యంత అనువైన రోజుగా భావిస్తున్నారు. ఆ రోజున బిజీ బిజీగా కొనుగోళ్లు సాగిస్తున్నారు. ఈ–కామర్స్‌ సంస్థ మీషో... తన డేటా ఆధారంగా జరిపిన ఇ షాపింగ్‌ 2002 అధ్యయనం ఇలాంటి పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. వీటిలో...

► ఈ ఏడాది ఈ కామర్స్‌ షాపర్స్‌.. ఆదివారం ఎక్కువగా కొనుగోళ్లు జరిపారు. అంతకు ముందు సంవత్సరం అత్యధిక కొనుగోళ్లు జరిపింది బుధవారం, అలాగే ప్రతి రోజూ రాత్రి 8 గంటలకు షాపింగ్‌ ప్రైమ్‌టైమ్‌గా కొనసాగింది. గత 2021లో మధ్యాహ్నం 2–3 గంటలలో అధికంగా ఈ– ట్రాఫిక్‌ కనిపించేది.

►2022లో ఎక్కువ మంది వెదికిన రెండవ ఉత్పత్తిగా స్మార్ట్‌ వాచ్‌ నిలిచింది. ఇది శారీరక ఆరోగ్యంపై, వ్యాయామాల పట్ల పెరిగిన ఆసక్తికి అద్దం పడుతోంది.

► గ్రూమింగ్‌ ఉత్పత్తులపై పురుషులు అమితాసక్తి చూపుతున్నారు. తృతీయశ్రేణి, నాల్గవ శ్రేణి నగరాల మార్కెట్‌ల నుంచి 60% కు పైగా ఆర్డర్లు లభించాయి.

► ద్వితీయశ్రేణి నగరాల నుంచీ శానిటరీ న్యాప్కిన్స్‌కు ఆర్డర్లు 9 రెట్లు పెరిగాయి. ఇది మహిళలకు ఈ–కామర్స్‌ ఏ విధంగా చేరువవుతుందో తెలియజేస్తుంది.

► దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి నిమిషానికి 148 చీరలు కొనుగోలు చేశారు. అలాగే రోజుకు 93వేల టీషర్టులు, 51, 275 బ్లూ టూత్‌ ఇయర్‌ఫోన్లు, 21,662 లిప్‌స్టిక్స్‌ విక్రయం జరిగింది.

► వినియోగదారులు స్థానిక ల్యాండ్‌మార్క్‌లు అయిన పిపాల్‌ క పేడ్, బర్గాద్‌ కా పేడ్‌, అట్టా చక్కీ కీ పీచే నియర్‌ వాటర్‌ ట్యాంక్‌ వంటివి వినియోగించడం ద్వారా డెలివరీ పర్సనల్‌కు సహాయపడ్డారు. దేశీ నేవిగేషన్‌ టూల్‌ కచ్చితత్త్వం ముందు డిజిటల్‌ మ్యాప్స్‌ పోటీపడలేవని ఇది వెల్లడిస్తుంది.

► ఈ సంవత్సరం అమ్మకాల పరంగా ఆంధ్రప్రదేశ్‌ వినియోగదారులు కొనుగోలు చేయడానికి అమిత ఆసక్తిని కనబరిచిన ఉత్పత్తులలో స్మార్ట్‌ వాచ్‌లు, వైర్‌లెస్‌ హెడ్‌ఫోన్స్, ఇయర్‌ ఫోన్స్, బాడీ లోషన్స్‌ కుర్తీలు ఉన్నాయి.

ఈ షాపింగ్‌.. పదనిసలు...
► గతంలో ఎన్నడూ లేనంతగా పురుషులు గ్రూమింగ్‌ మీద ఖర్చు చేశారు.
► జిమ్‌ ఎక్విప్‌ మెంట్‌కి సంబంధించిన ఆర్డర్స్‌ దాదాపుగా 3 రెట్లకు పైనే పెరిగిపోయాయి.
► అత్యధిక సంఖ్యలో యోగామ్యాట్స్‌ కొన్న నగరాల్లో బెంగుళూర్, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్‌లు ఉన్నాయి.
► ప్రతీ 10 పుస్తకాల్లో 8 పుస్తకాలకు ఆర్డర్స్‌ ద్వితీయశ్రేణి నగరాలు, మార్కెట్ల నుంచే వచ్చాయి.

చదవండి: MNCs Quitting India: భారత్‌ను వదిలి వెళ్లిపోతున్న దిగ్గజ కంపెనీలు.. కారణం అదే!

మరిన్ని వార్తలు