భారత్‌కు గుడ్‌బై చెప్పిన విదేశీ ఈ-కామర్స్‌ కంపెనీ... గట్టి కౌంటర్‌ ఇచ్చిన మీషో..! 

30 Mar, 2022 16:44 IST|Sakshi

సింగపూర్‌కు చెందిన ఇంటర్నెట్ దిగ్గజం సీ లిమిటెడ్‌(SEA) తమ ఈ-కామర్స్ వ్యాపారాన్ని(షాపీ) భారత్‌లో పూర్తిగా  మూసివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షాపీపై  స్వదేశీ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫాం మీషో ట్విటర్‌లో గట్టి కౌంటర్‌ను ఇచ్చింది. 

మేం రెడీ..!
షాపీ తన సేవలను పూర్తిగా మూసివేస్తున్నట్లు సోమవారం రోజున  ప్రకటించింది. దీంతో ఈ సంస్థ విక్రేతలు, ఉద్యోగుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. షాపీ ఎగ్జిట్‌పై భారత ఈ-కామర్స్‌ సంస్థ మీషో ట్విటర్‌లో స్పందించింది. మీషో తన ట్విట్‌లో..."మీషోతో షాపీ-ఇంగ్ చాలా సులభమైనది, సులువైనది,  వేగవంతమైనది." అంటూ షాపీకు గట్టి కౌంటర్‌ను ఇచ్చింది. అంతేకాకుండా తమ సంస్థ ఉద్యోగుల నియామకం కోసం గేట్లను తెరిచి ఉంచామని మీషో పేర్కొంది. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం...మీషోలో ప్రోడక్స్ట్‌, ఇంజనీరింగ్, డిజైన్, యూఆర్‌, డేటా సైన్స్‌తో సహా అన్ని టీమ్‌లలో 136 ఉద్యోగాలు అందుబాటులో ఉన్నటు​ తెలుస్తోంది. ఉద్యోగులకు శాశ్వత వర్క్‌ ఫ్రం హోంను కూడా అందిస్తోంది. 

గేమ్‌ను నిలిపివేసినందుకు గాను..
గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి దృష్ట్యా భారత్‌లో తమ కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు షాపీ  ప్రకటించింది. దీని ఫలితంగా న్యూయార్క్-లిస్టెడ్ ఆగ్నేయాసియా సంస్థ షాపీ మార్కెట్ విలువ ఒక్క రోజులో 16 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. కాగా సీ లిమిటెడ్‌ రూపొందించిన మొబైల్‌ గేమ్‌ ఫ్రీ ఫైర్‌ను నిషేధించినందకు కంపెనీ తమ కార్యకలపాలను వెనక్కి తీసుకున్నట్లు ఊహగానాలు వచ్చాయి. వీటిని షాపీ పూర్తిగా కొట్టివేసింది. 
 


చదవండి: భారత్‌కు గుడ్‌బై చెప్పిన మరో విదేశీ కంపెనీ..!

>
మరిన్ని వార్తలు