Meesho: మీషో మెగా బ్లాక్‌బస్టర్ సేల్‌: ఒక్కరోజులోనే...

24 Sep, 2022 18:49 IST|Sakshi

సాక్షి,ముంబై:పండుగ సీజన్సేల్‌లో ఫ్యాషన్‌ రీటైలర్‌ ‘మీషో’ భారీ అమ్మకాలను నమోదు చేసింది. మొదటి రోజే 88 లక్షల ఆర్డర్‌లను సాధించింది. దీంతో  మీషో అమ్మకాలు 80 శాతం పెరిగాయి.ఒక రోజులో కంపెనీ సాధించిన రికార్డ్‌ సేల్‌ అని మీషో తెలిపింది.

సాఫ్ట్‌బ్యాంక్ నిధులఅందించే ఆన్‌లైన్ రిటైలర్మీషో తన ఐదు రోజుల హాలిడే సేల్‌లో మొదటి రోజు దాదాపు 87.6 లక్షల ఆర్డర్లు వచ్చాయని, అమ్మకాలు 80శాతం పెరిగాయని శనివారం వెల్లడించింది.  ముఖ్యంగా  టైర్ 2, 3 , 4 నగరాల్లో  మొదటి రోజు దాదాపు 85శాతం ఆర్డర్లు  లభించాయని మీషో ఒక ప్రకటనలో నివేదించింది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపడం సంతోషంగా ఉందని తెలిపింది.

చీరల నుండి అనలాగ్ వాచ్‌లు, జ్యువెలరీ సెట్‌లు, మొబైల్ కేసులు, కవర్లు, బ్లూటూత్ హెడ్‌ఫోన్‌లు, ఛాపర్లు, పీలర్‌లను రికార్డ్ వాల్యూమ్‌లలో కొనుగోలు చేశారని కంపెనీ తెలిపింది. ఫ్యాషన్, బ్యూటీ, వ్యక్తిగత సంరక్షణ, కిచెన్‌,ఎలక్ట్రానిక్ ఉపకరణాలు లాంటివి  తొలి రోజు అత్యధికంగా అమ్ముడైన కేటగిరీలుగా ఉన్నాయట.
 

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు