అపుడు కరోడ్‌పతి షో సెన్సేషన్‌: మరి ఇపుడు

23 Jun, 2023 14:06 IST|Sakshi

 ఆల్వేస్‌ టాపర్‌ ఆకాశమే హద్దు!

 తండ్రి స్ఫూర్తితో ఐపీఎస్‌

కేబీసీ కరోడ్‌పతి రవి మోహన్ సైనీ గుర్తున్నారా.  బాలీవుడ్‌ మెగా స్టార్‌ అమితాబ్ బచ్చన్ హోస్ట్  చేసిన  టాప్‌ గేమ్ షో  కౌన్‌ బనేగా  కరోడ్‌పతి టెలివిజన్ షో 2001లో రవి పెద్ద నేషనల్‌ సెన్సేషన్‌. కేవలం 14 సంవత్సరాలకే  కౌన్ బనేగా కరోడ్‌పతి జూనియర్‌ని రవి మోహన్ సైనీ గెలుచుకున్నారు.15 కఠినమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి అప్పట్లో పెద్ద సంచలనం రేపాడు.

అంతేనా దయాగాడి దండయాత్ర  అన్నట్టు రవి విజయ పరంపర ఆగిపోలేదు. కేబీసీ జూనియర్ విజేత మాత్రమే కాదు, ఆ తరువాత డాక్టర్ అయ్యాడు  యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసి ఐపీఎస్‌గా ఆ తర్వాత వార్తల్లో నిలిచాడు. 20 ఏళ్ల తర్వాత 34 ఏళ్ల వయసులో 2021లో గుజరాత్‌లో పోరుబందర్‌కి ఎస్పీగా బాధ్యతలు చేపట్టడంతో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.  ఊహించని విజయాలతో తన భవిష్యత్తును తీర్చిదిద్దుకున్న రవిసైనీ విజయగాథ ఇది. 

కేబీసీ నాటికి రవి 10వ తరగతి చదువుతున్నాడు. మెగాస్టార్‌ అబితాబ్‌ని కలవాలన్న కలతో పాటు షోలో తన అదృష్టాన్ని పరీక్షించుకుని తానే ఒక స్టార్‌గా నిలిచాడు. అప్పటికే మంచి విద్యార్థి ,ఎప్పుడూ టాపర్ అయిన రవిలో ఇది మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. జైపూర్‌లోని మహాత్మా గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన రవి యూపీఎస్‌సీ ప్రిపరేషన్‌ కోసం ఎలాంటి కోచింగూ తీసుకోకపోవడం మరో విశేషం. (టీసీఎస్‌లో భారీ కుంభకోణం: రూ.100 కోట్ల కమిషన్లు మింగేశారు!)

2012 లో మెయిన్స్‌ను క్లియర్ చేయలేకపోయాడు. దీంతో 2013లో, భారత తపాలా శాఖ ఖాతాలు, ఆర్థిక సేవలకు ఎంపికయ్యాడు. ఆ తరువాత మెడికల్ ఇంటర్న్‌షిప్ చేస్తున్నప్పుడే  2014లో,  ఆల్ ఇండియా ర్యాంక్ 461తో  అర్హత సాధించాడు. తండ్రి నేవీ అధికారి స్ఫూర్తితోనే ఐపీఎస్‌లో చేరానంటారు ఎస్పీ డా.  రవి  మోహన్‌ సైనీ. 

మరిన్ని బిజినెస్‌ వార్తలు,  ఇంట్రస్టింగ్‌ కథనాల కోసం చదవండి: సాక్షిబిజినెస్‌

మరిన్ని వార్తలు