అమ్మగా ఆలోచించి.. రూ. 50 కోట్లకు పైగా ఆదాయం.. ఈమె స్విమ్మింగ్‌ చాంపియన్‌ కూడా...

29 Mar, 2023 12:24 IST
సహ వ్యవస్థాపకురాలు శౌరవి మాలిక్‌తో కలిసి మేఘనా నారాయణ్‌

ప్రస్తుతం మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచమంతా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై జనానికి స్పృహ పెరిగింది.  పిల్లలు తినే ఆహారం గురించి తల్లిదండ్రులు ఎప్పుడూ ఆందోళన చెందుతుంటారు. దీనికి పరిష్కారం కోసం ఆలోచించిన ఓ స్విమ్మింగ్‌ చాంపియన్‌ ఓ కంపెనీ పెట్టి పిల్లలకు మంచి ఆహారం అందిస్తోంది... మంచి లాభాలూ ఆర్జిస్తోంది.

ఇదీ చదవండి: Pepsi New Logo: పెప్సీ కొత్త లోగో అదుర్స్‌! 15 ఏళ్ల తర్వాత...

 

కూతురు కోసం చేసిన ప్రయత్నం..
పుణెకు చెందిన మేఘనా నారాయణ్‌కు పిల్లల పోషణ, ఆరోగ్యం పట్ల మక్కువ ఎక్కువ. పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడంపైనే ఆమె ఆలోచనలు ఎప్పుడూ ఉండేవి.  ఈ నేపథ్యంలో శౌరవి మాలిక్, ఉమంగ్ భట్టాచార్య అనే మరో ఇద్దరితో కలిసి 2015లో పిల్లల కోసం ఆర్గానిక్ ఫుడ్ ఉత్పత్తులను అందించే హోల్సమ్ ఫుడ్స్ (స్లర్ప్ ఫార్మ్ అండ్‌ మిల్లె) అనే కంపెనీని స్థాపించారు. తన పాపాయికి ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారాన్ని అందించడానికి ఆమె చేసిన ప్రయత్నాలే ఆమెను ఈ వ్యాపారం ప్రారంభించేలా చేశాయి. స్లర్ప్ ఫామ్ ప్రారంభించే ముందు మేఘనా మెకన్సీ అండ్‌ కంపెనీలో పబ్లిక్ హెల్త్ ప్రాక్టీస్‌కు నాయకత్వం వహించారు. స్లర్ప్ ఫార్మ్ సంస్థలో ప్రముఖ బాలివుడ్‌ నటి అనుష్క శర్మ కూడా పెట్టుబడి పెట్టడం విశేషం. ఈ సంస్థ 2022 ఫిబ్రవరి నాటికి రూ. 57 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది.

ఇదీ చదవండి: Charges on UPI: యూపీఐ చెల్లింపులపై అదనపు చార్జీలు.. యూజర్లకు వర్తిస్తాయా?  

స్విమ్మింగ్‌లో చాంపియన్‌
మేఘనా నారాయణ్ అంతర్జాతీయ స్విమ్మింగ్ ఛాంపియన్. ఆమె 400 బంగారు పతకాలను గెలుచుకుంది. మేఘన ఎనిమిదేళ్ల పాటు భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఆసియా క్రీడలు సహా అనేక పోటీల్లో ఆమె పాల్గొని పతకాలు సాధించారు. ఒలింపిక్‌ క్రీడల్లో దేశానికి బంగారు పతకం సాధించాలనేది ఆమె కల.

మేఘన విద్యాభ్యాసం
మేఘన బెంగళూరు యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజనీరింగ్‌లో బీఈ పూర్తి చేశారు. ఆ తర్వాత 2002లో ఆక్స్‌ఫర్డ్‌లోని ఓరియల్ కాలేజీకి రోడ్స్ స్కాలర్‌గా కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చదవడానికి వెళ్లారు. 2007లో ఆమె హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు.

ఇదీ చదవండి: పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్‌.. పేటీఎం వ్యాలెట్‌ నుంచి ఏ మర్చంట్‌కైనా చెల్లింపులు 

మరిన్ని వార్తలు