ఇంత కథ నడిచిందా!, చోక్సీ భారత్‌ రాకుండా లంచాలు ఎరచూపుతున్నారా?

13 Jan, 2023 14:51 IST|Sakshi

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయిన మెహుల్ చోక్సీ భారత్‌కు రాకుండా ఉండేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఫైనాన్షియల్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేటర్‌, ప్రముఖ ఎడిటర్‌ కెన్నెత్‌ రిజోక్‌ తెలిపారు. 

చోక్సీ లంచాల భాగోతంపై కెన్నెత్‌ రిజోక్‌ తన బ్లాగ్‌ (rijock.blogspot)లో ఓ ఆర్టికల్‌ ను పోస్ట్‌ చేశారు. ఆ న్యూస్‌ ఆర్టికల్‌లో కరేబియన్‌ దేశమైన ఆంటిగ్వాలో ఉంటున్న చోక్సీ భారత్‌కు రాకుండా ఉండేలా ఉన్నతాధికారులకు లంచాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా ఇక్కడ (ఆంటిగ్వాలో) అతనిని అదుపులోకి తీసుకొని భారత్‌కు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్న ఇంటర్‌పోల్ ప్రయత్నాలకు స్థానిక అధికారులు అడ్డుపడుతున్నారని చెప్పారు. 

సీనియర్‌ పోలీస్‌ అధికారి ఆడోనిస్‌ హెన్రీ
(ప్రతీకాత్మక చిత్రం : సీనియర్‌ పోలీస్‌ అధికారి ఆడోనిస్‌ హెన్రీ

అంతేకాదు న్యాయ విచారణ ఆలస్యంగా జరిగేలా ఆంటిగ్వా ప్రభుత్వ పెద్దలతో పాటు సీనియర్‌ పోలీస్‌ అధికారి ఆడోనిస్‌ హెన్రీ వంటి అధికారులకు లంచాలు ఇవ్వడం ద్వారా తన అప్పగింతను ఆలస్యం చేస్తున్నట్లు తేల్చారు  

ఆంటిగ్వాలో వ్యాపారం
భారత్‌లో బ్యాంకుల్ని కొల్లగొట్టిన చోక్సీ ఆంటిగ్వాలో పెద్ద ఎత్తున రెస్టారెంట్‌ వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. చోక్సీకి సొంతమైన జోలీ హార్బర్‌ రెస్టారెంట్‌లో హెన్రీని పలు మార్లు కలిసినట్లు తన వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. చోక్సీ హెన్నీని కలవడం మాత్రమే కాదని, లంచం ఇచ్చి న్యాయ విచారణ ఆలస్యంగా జరిగేలా  మేజిస్ట్రేట్ కాన్లిఫ్ క్లార్క్‌ని సైతం ప్రభావితం చేస్తున్నారని నివేదికలో హైలెట్‌ చేశారు. 


(ప్రతీకాత్మక చిత్రం : మేజిస్ట్రేట్ కాన్లిఫ్ క్లార్క్‌

పక్కా ఆధారాలున్నాయి
క్లార్క్‌,హెన్రీలు కుట్రపన్ని ఇంటర్‌ పోల్‌ అధికారులకు చిక్కకుండా జాగ్రత్త పడుతున్నారని, అందుకు తగిన సాక్ష్యాదారాలు తన వద్ద ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాబట్టే చోక్సీని ఇండియాకు తీసుకొని రావడం కష్టతరంగా మారిందన్నారు. 

కిడ్నాప్‌ డ్రామా.. విఫలం
అంటిగ్వా నుండి క్యూబాకు పారిపోవడానికి చోక్సీ కిడ్నాప్‌ డ్రామా ఆడి అందులో విఫలమైనట్లు రిజోక్‌ ఆ కథనంలో వివరించారు. 2021లో క్యూబా - భారత్‌ల మధ్య నేరస్థుల అప్పగింత ఒప్పందం లేనందున విచారణ నుండి తప్పించుకునేందుకు క్యూబా పారిపోవాలని చోక్సీ భావించాడని నివేదికలో పేర్కొన్నాడు. మే 2021లో స్మగ్లర్ల సాయంతో పారిపోయే ప్రయత‍్నంలో చోక్సీ .. వారికి చెల్లించాల్సిన మొత్తాన్ని ఇవ్వలేదని, అందుకే వాళ్లు డొమినికాలో వదిలేశారని చెప్పారు.

చదవండి👉 బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన ప్రబుద్ధుల్లో ఈయనే నెంబర్‌ వన్‌!

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు