తగ్గేదేలే అంటున్న మేఘా.. ఆ సెక్టార్‌లో సక్సెస్‌ బాట

9 Mar, 2022 07:55 IST|Sakshi

రిగ్స్‌ సరఫరా వేగవంతం: మేఘా 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: నిర్మాణ రంగ సంస్థ మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ (ఎంఈఐఎల్‌).. ఓఎన్‌జీసీకి రిగ్స్‌ సరఫరాను వేగవంతం చేసింది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి వద్ద ఉన్న ఓఎన్‌జీసీ చమురు క్షేత్రానికి 2,000 హెచ్‌పీ సామర్థ్యం గల అత్యాధునిక ల్యాండ్‌ డ్రిల్లింగ్‌ రిగ్‌ను అందించింది. ఇది 3,000 హెచ్‌పీ సామర్థ్యంతో పనిచేసే సంప్రదాయ రిగ్‌ కన్నా అధిక పనితీరును కనబరుస్తుందని ఎంఈఐఎల్‌ రిగ్స్‌ ఇంచార్జ్‌ సత్యనారాయణ తెలిపారు.

 ‘6,000 మీటర్ల లోతు వరకు ఇది తవ్వగలదు. ఇప్పటి వరకు 10 ల్యాండ్‌ డ్రిల్లింగ్‌ రిగ్స్‌ను ఎంఈఐఎల్‌ సరఫరా చేసింది. ఇందులో మూడు ఇప్పటికే పనిచేస్తున్నాయి. మిగిలిన ఏడు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ రిగ్స్‌ మరో నాలుగైదు వారాల్లో ఓఎన్‌జీసీ చమురు క్షేత్రాల్లో పనిచేయడం ప్రారంభిస్తాయి. పోటీ బిడ్డింగ్‌లో 47 రిగ్స్‌ సరఫరాకై ఓఎన్‌జీసీ నుంచి ఆర్డర్‌ను ఎంఈఐఎల్‌ దక్కించుకుంది’ అని ఎంఈఐఎల్‌ రిగ్స్‌ ఇంచార్జ్‌ సత్యనారాయణ వివరించారు.   
 

మరిన్ని వార్తలు