5జీ ట్రయల్స్‌ అంటున్నారు? మరీ విమానాల భద్రత సంగతెంటీ?

4 Feb, 2022 20:18 IST|Sakshi

మొబైల్‌ సర్వీసుల్లో 5జీని ప్రవేశపెట్టడంపై అమెరికన్‌ ఏవియేషన్‌ సెక్టార్‌ గజగజ వణికిపోయింది. ఇండియా నుంచి యూఎస్‌ఏ వెళ్లే విమాన సర్వీసులు సైతం నిలిచిపోయాయి. త్వరలో ఇండియాలో 5జీ సర్వీసులు ప్రారంభించనున్నందున మన విమాన సర్వీసుల భద్రతపై పార్లమెంటులో కేంద్రాన్ని వివరణ అడిగారు మన ఎంపీలు.

5జీ ట్రయల్స్‌కి అనుమతి ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది. అలాంటప్పుడు 5జీ సర్వీసుల వల్ల విమానాలకు ఏమైనా ప్రమాదమా ? దీనికి సంబంధించి ప్రభుత్వం వద్ద ఏదైనా రిపోర్టు ఉందా అంటూ పార్లమెంటు సభ్యులు కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇంటర్నేషనల్‌ టెలి కమ్యూనికేషన్స్‌తో పాటు 5జీకి కేటాయించిన ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌తో ఎయిరోనాటికల్‌ కమ్యూనికేషన్స్‌కి ఎటువంటి ఇబ్బంది లేదని కేంద్రం సమాధానం ఇచ్చింది.  5జీ సర్వీసుతో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఎయిరోనాటికల్‌ వ్యవస్థకు భద్రత ఉందని కేంద్రం భరోసా ఇచ్చింది.

మనదేశంలో జియో, వోడాఐడియా, ఎయిర్‌ఎట్‌, ఎంఎన్‌టీఎల్‌ సంస్థలకు 5జీ ట్రయల్స్‌ చేసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఎంపిక చేసిన ఏరియాల్లో ఈ ట్రయల్స్‌ విజయవంతంగా నడుస్తున్నాయి. మరోవైపు ఈ ఏడాదిలోనే 5జీ సర్వీసులు ప్రారంభిస్తామని కేంద్రం బడ్జెట్‌లో తెలిపింది. ఇటీవల అమెరికాలో 5జీ సర్వీసులు ప్రారంభించగా ... విమానయాన సం‍స్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఎయిరోనాటికల్‌ కమ్యూనికేషన్స్‌కి ఇబ్బంది అంటూ విమానాలను గాల్లోకి ఎగురనివ్వలేదు.
 

చదవండి:అమెరికాలో 5జీ సేవలు ప్రారంభం.. భయాలతో విమానాల రీషెడ్యూల్‌!

మరిన్ని వార్తలు