అన్నీ సాహసాలే: ఆరు నెలలకే వేల కోట్ల బిజినెస్‌!

20 May, 2023 16:41 IST|Sakshi

ప్రముఖ ఈకామర్స్ బ్రాండ్‌ మింత్రా సీఈఓగా అనంత్ నారాయణన్ ఇప్పటికే కార్పొరేట్ వర్గాల్లో పాపులర్‌. కీలక పదవిలో ఉన్నప్పటికీ తన సొంత కంపెనీ ప్రారంభించే సాహసం చేయడమే కాదు ఆరునెలల్లో ఏకంగా రూ. 9,900 కోట్లకుపైగా సంపదను సాధించడం విశేషం. అతి తక్కువ సమయంలోనే ఫాస్టెస్ట్‌ గ్రోయింగ్‌ యూనికార్న్‌గా బిలియన్‌ డాలర్ల కంపెనీ  మెన్సా బ్రాండ్స్ వ్యవస్థాపకుడిగా,  రికార్డు సృష్టించిన అనంత్‌  నారాయణన్‌ సక్సెస్‌ స్టోరీ...!

కేవలం రెండేళ్ళ వ్యవధిలో రెండు పెద్ద బ్రాండ్‌ల వ్యవస్థాపకుడిగా ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీని ప్రారంభించిన ఘనత అనంత్‌నారాయణన్‌ది. భారతదేశంలో స్టార్టప్‌లకు ఆదరణ లభిస్తున్న సమయంలో అనంత్ నారాయణన్ తన దృష్టిని అటువైపు మళ్లించారు. సౌకర్యవంతమైన పదవిని వదిలేసి భారతదేశపు తొలి ఈ-కామర్స్ 'యునికార్న్'  ఆవిష్కారానికి పూనుకున్నారు. కోవిడ్-19  మహమ్మారి అనంతరం 2021లో మే నెలలో మెన్సా కంపెనీని స్థాపించారు. ఈ  వెంచర్  ఒక నెలలోనే తొలి ఫండింగ్‌గా 50 మిలియన్ల డాలర్లను అందుకుంది.  ఆరువాతి ఐదు నెలలకే 135 మిలియన్ల డాలర్ల నిధులను సేకరించిన తర్వాత కంపెనీ వాల్యూ  బిలియన్ డాలర్లకు చేరుకోవడం విశేషం.  (స్వీట్‌ కపుల్‌ సక్సెస్‌ స్టోరీ: తొలి ఏడాదిలోనే రూ.38 కోట్లు)

అనంత్ మద్రాస్ మిచిగాన్ విశ్వవిద్యాలయాల నుండి  ఉన‍్నత విద్యాను అభ్యసించారు . ప్రముఖ మెకిన్సే  కంపెనీకి  కీలక పదవుల్లో  పనిచేశారు.  ఆ తర్వాత  ఫ్యాషన్‌ రీటైలర్‌ మింత్రాకి సీఈవోగాను పనిచేశారు. సీఈవోగా అధిక జీతం ఇచ్చే ఉద్యోగాన్ని విడిచిపెట్టి మరీ మెడ్‌లైఫ్‌.కామ్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈఓగా ఉన్నారు. అయితే   అనంత్ తొలి వెంచర్‌ను ఫార్మసీ కొనుగోలు చేసింది. (దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ!)

అమెరికన్ యునికార్న్ ప్రేరణతో అనంత్  మెన్సా అనే సొంత  బ్రాండ్‌తో ఈ-కామర్స్  రంగంలోకి అడుగుపెట్టారు. ముఖ్యంగా  చిన్న వ్యాపారుల ఉత్పత్తులను  ఈ ప్లాట్‌ఫారమ్‌ ద్వారా విక్రయిస్తుంది.   మెన్సా అనే పదానికి గ్రీకులో కాన్స్టెలేషన్ అని అర్థం. డిజిటల్-ఫస్ట్ బ్రాండ్ల క్లస్టర్‌ మోడల్‌గా  మెన్సాను తీర్చి దిద్దారు.  డజనుకు పైగా బ్రాండ్‌లతో భాగస్వామ్యం కలిగి ఉంది. సంవత్సరానికి 100శాతం వృద్ధి రేటుతో  దూసుకుపోతోంది. ప్రారంభించిన ఆరు నెలల్లోనే  బిలియన్‌ డాలర్లు, అంతకంటే ఎక్కువ విలువైన భారతీయ యునికార్న్‌ గ్రూపులో  అత్యంత వేగంగా ప్రవేశించిన స్టార్టప్‌గా నిలిచింది.ఇప్పటికే డజన్ల బ్రాండ్‌లను కొనుగోలు చేసింది.మెన్సా తన పోర్ట్‌ఫోలియో వృద్ధికి నిధులను ఉపయోగించాలని భావిస్తోందని ఇటీవల నారాయణన్‌ స్వయంగా వెల్లడించారు.

ఇలాంటి మరెన్నో  సక్సెస్‌ స్టోరీలు, ప్రేరణాత్మక కథనాలకోసం చదవండి: సాక్షి బిజినెస్‌

మరిన్ని వార్తలు